1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Roja Selvamani very active in Face Book

ఫేస్ బుక్‌ను అలా వాడుకుంటున్న రోజా..?

Roja Selvamani
సాధారణంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారికి ఒక సమాచారం ప్రజలకు చేరాలంటే కష్టంతో కూడుకున్న పని. కానీ ఇప్పుడు అందరూ సోషల్ మీడియాను ఎక్కువగా వాడుకుంటున్నారు. టీవీ ఛానళ్ళ రిపోర్టర్లు వస్తారు.. వారు కవరేజ్ చేస్తేనే జనంలోకి వెళుతుందని అందరూ ఇంతకుముందు అనుకునేవారు. కానీ అలాంటి పరిస్థితి తగ్గిందనేది అందరికీ దాదాపుగా తెలిసిన విషయమే.
 
నగరి ఎమ్మెల్యే, ఎఐసిసి ఛైర్ పర్సన్ రోజా కూడా సామాజిక మాథ్యమాన్నే నమ్ముకున్నారు. చిత్తూరు జిల్లాలోని ఒక మూలన ఉన్న నగరి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రోజా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తాను తన సొంత నియోజకవర్గంలో పర్యటించిన సమయంలో అక్కడి కార్యక్రమాలు జనాలకు తెలియాల్సిన అవసరం ఉందని రోజా అనుకున్నారు.
 
కానీ ఆమె తన నియోజకవర్గంలో పర్యటించే కార్యక్రమాలు ఏవీ జనంలోకి వెళ్ళడంలేదు. దీంతో రోజాకు ఒక మంచి ఆలోచన వచ్చింది. తన ఫేస్ బుక్‌ పేజీలో తాను చేసే కార్యక్రమాలన్నింటినీ అప్ లోడ్ చేయడం ప్రారంభించారు. ఆ కార్యక్రమానికి ఇటీవలే రోజా శ్రీకారం చుట్టేశారు కూడా. నగరి నియోజకవర్గంలోని వడమాలపేట మండలంలో జరిగిన గ్రామ వాలంటీర్ల నియామక పత్రాల అందజేత కార్యక్రమాన్ని ఫోటోలు తీసి ఆ ఫోటోలను రోజా స్వయంగా ఫేస్ బుక్‌లో అప్‌లోడ్ చేశారు. ఆమె పంపిన సమాచారాన్ని నెటిజన్లు తెగ చూసేస్తున్నారు. రోజాను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
About Writer
జె
తర్వాతి కథనం
ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ, కశ్మీర్‌లో వచ్చే మార్పులేంటి?