శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సందీప్ రేవిళ్ళ
Last Modified: మంగళవారం, 5 మార్చి 2019 (22:11 IST)

స్నేహితుడిని తిట్టేందుకు పుల్వామా అటాక్‌ను వాడుకున్నాడు... జైల్లో పడ్డాడు...

స్నేహితుడిపై ఉన్న ద్వేషంతో అదనుచూసుకుని ఇబ్బందులలో పెట్టాలనుకున్నాడు ఓ వ్యక్తి. ఇందుకు ఫేస్‌బుక్‌ని వేదికగా చేసుకున్నాడు. స్నేహితుని ఫేస్‌బుక్ ఖాతాని హ్యాక్ చేసి ఇబ్బందులకు గురిచేశాడు. ఇందుకోసం పుల్వామా దాడిని అదునుగా తీసుకున్నాడు. పాకిస్తాన్‌కి అనుకూలంగా కామెంట్‌లు పెట్టసాగాడు. 
 
రాయ్‌బాక్‌ తాలుకా కంకన్‌వాడి గ్రామానికి చెందిన నాగరాజ్‌, షఫి గతంలో స్నేహితులు, డబ్బులు విషయంలో ఏదో గొడవపడి ఇద్దరూ విడిపోయారు. నాగరాజ్ షఫిపై ద్వేషం పెంచుకున్నాడు. పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందిపై జరిగిన ఉగ్రదాడి తర్వాత, దానిని అదునుగా తీసుకుని షఫీని ఇబ్బందులలో పెట్టాలనుకున్నాడు. 
 
స్నేహితుని ఫేస్‌బుక్ ఖాతాని హ్యాక్ చేసి పాకిస్తాన్‌కి అనుకూలంగా కామెంట్‌లు పెట్టాడు. ఇబ్బందులకు గురైన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. సైబర్‌సెల్‌ విభాగం కేసు దర్యాప్తు చేసింది. ఇందులో నిందితుడు నాగరాజ్ అని తెల్చింది. అతడిని అరెస్ట్ చేసి సైబర్ క్రైమ్‌తోపాటు దేశద్రోహం క్రింద కేసు నమోదు చేసారు.