బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By కుమార్ దళవాయి
Last Modified: సోమవారం, 1 ఏప్రియల్ 2019 (18:20 IST)

ఫేస్‌బుక్ మరో కీలక నిర్ణయం... ఫేస్‌బుక్ లైవ్‌పై ఆంక్షలు

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు ఈ మధ్య కాలంలో వరుస ఎదురుదెబ్బలు తగులుతుండటంతో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఫేస్‌బుక్ లైవ్‌లను పర్యవేక్షించనుంది. ఈ మేరకు లైవ్‌లో కొన్ని ఆంక్షలు కూడా విధించాలని కూడా ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఫేస్‌బుక్ సీవోవో షెరిల్ శాండ్‌బెర్గ్ వెల్లడించారు.
 
ప్రామాణిక అంశాలపై ఆధారపడి ఫేస్‌బుక్‌లో ఎవరెవరు లైవ్‌కు వెళ్లవచ్చు అనే విషయాన్ని ఫేస్‌బుక్ పరిశీలిస్తోందని ఆమె తన బ్లాగ్‌లో వెల్లడించారు. కాగా ఇటీవల న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన నరమేధం ఫేస్‌బుక్‌లో లైవ్ అయింది. ఈ సంఘటనతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దుమారం చెలరేగడంతో తమ మాధ్యమంలో మరిన్ని ఆంక్షలు విధించాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా లైవ్‌లు, రెచ్చగొట్టే ప్రసంగాలపై ఆంక్షలను విధించనున్నారు.