సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By మోహన్
Last Updated : శుక్రవారం, 29 మార్చి 2019 (17:54 IST)

వాట్సాప్‌లో ఫింగర్‌ప్రింట్ ఆథెంటికేషన్ వచ్చేసింది

ప్రస్తుతం సోషల్ మీడియాలో వాట్సాప్‌కి ప్రత్యేక స్థానం ఉంది. ఈ యాప్ వినియోగదారులకు మరింత సౌకర్యవంతంగా మారింది. ఇప్పుడు వాట్సాప్ యూజర్లకు ఒక గుడ్ న్యూస్ వచ్చేసింది. యూజర్లు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఫింగర్‌ప్రింట్ ఆథెంటికేషన్ వచ్చేసింది. లేటెస్ట్ బీటా వెర్షన్‌లో ఈ ఫీచర్ కనిపిస్తోంది. ఫింగర్‌ప్రింట్ ఆథెంటికేషన్‌తో పాటు డార్క్ మోడ్ కూడా కనిపించింది. 
 
గతంలో ఐఓఎస్ యూజర్లకు ఫింగర్‌ప్రింట్ ఆథెంటికేషన్ ఫీచర్ రిలీజ్ చేసిన వాట్సాప్... ఇప్పుడు ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సాప్ బీటా యూజర్లు ఫింగర్‌ప్రింట్ ఆథెంటికేషన్ ఫీచర్‌కు సంబంధించిన ఫోటోలను ఆన్‌లైన్‌లో రిలీజ్ చేసారు. త్వరలో మీ వాట్సాప్ యాప్ అప్‌డేట్ అయితే మీరు కూడా ఈ కొత్త ఫీచర్ వాడుకోవచ్చు.