ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By వాసు
Last Updated : శుక్రవారం, 15 మార్చి 2019 (10:50 IST)

వాట్సాప్‌లో ఫేక్ ఇమేజ్‌.. న్యూఫీచర్‌తో ఇలా గుర్తించవచ్చు...

సోషల్ మీడియాలో అత్యంత వేగవంతమైన యాప్ వాట్సాప్. పైగా, అత్యధిక ప్రజాధారణ పొందింది. అయితే, ఇందులో షేర్ అయ్యే సమాచారంలో చాలా మేరకు ఫేక్ న్యూస్ ఉంటుంది. ఇలాంటి ఫేక్ న్యూస్‌ను అరికట్టేందుకు వాట్సాప్ సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూనే ఉంది. 
 
ఒకవైపు మెసేజ్ ఫార్వర్డింగ్‌కు లిమిట్స్‌ తీసుకువస్తూనే.. మరోవైపు తన వినియోగదారులకు ఫేక్ న్యూస్‌ను గురించిన అవగాహన కల్పించేలా వాణిజ్య ప్రకటనలు కూడా ఇస్తోంది. అయితే, వాట్సాప్ ఇంతటితో ఆగిపోలేదు. తన యాప్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ పేరిట మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రెడీ అవుతోంది.
 
వాట్సాప్ బీటా 2.19.73 ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లో రివర్స్‌ సెర్చ్ ఇంజిన్‌ ఫీచర్ అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను బీటా యూజర్లు మాత్రమే ఉపయోగించగలరు. రివర్స్ సెర్చ్ ఇంజిన్ ఫీచర్ అందరికీ అందుబాటులోకి రావడానికి మరికొంత కాలం పట్టవచ్చు.
 
ఈ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఎలా చేయాలంటే... వాట్సాప్ చాట్‌లో వచ్చిన ఏదైనా ఇమేజ్‌ను హైలైట్ (సెలెక్ట్) చేసుకుంటే.. పైన మూడు చుక్కలు కనిపిస్తాయి. వీటిపై టచ్ చేస్తే మెనూ ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు ఇమేజ్ సెర్చ్ ఫీచర్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేస్తే బ్రౌజర్ విండో ఓపెన్ అవుతుంది. అక్కడ వాట్సాప్ చాట్‌లో వచ్చిన ఫోటోకు సంబంధించిన సమాచారం కనిపిస్తుంది. అక్కడ చాట్ ఫోటోను పోలిన ఇతర ఫోటోలను చూడవచ్చు. దీని ద్వారా యూజర్‌కు వచ్చిన ఇమేజ్ నిజమైందా? కాదా? అని తెలుసుకోగలుగుతారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వాట్సాప్ ఈ ఫీచర్‌ను తీసుకు వస్తూండడం ఆశించదగ్గ పరిణామంగానే చెప్పవచ్చు.