సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By కుమార్
Last Updated : మంగళవారం, 12 మార్చి 2019 (14:22 IST)

కొడుకు మాట విన్నందుకు ఫలితం రూ.90 కోట్లు

బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్ కుమార్ గత రెండేళ్లుగా వరుస విజయాలతో బాలీవుడ్‌లో దూసుకెళ్లిపోతున్నాడు. మంచి కథ, అద్భుతమైన నటన ఉండటంతో విమర్శకులు కూడా ప్రశంసిస్తున్నారు. ఇదే ఊపులో సినిమాలతో పాటు వెబ్‌సిరీస్ చేసేందుకు కూడా అక్షయ్ ఒప్పందం కుదుర్చుకున్నాడు.
 
ప్రస్తుతం సినిమాల కంటే వెబ్‌సిరీస్‌కు ఆదరణ ఎక్కువగా ఉండటం, ఇంకా అవి మరింత లాభసాటిగా ఉండటంతో పెద్ద పెద్ద స్టార్లు అందరూ వీటికే మొగ్గు చూపుతున్నారు. తాజాగా అక్షయ్ కుమార్ కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోస్ డిజిటల్ ప్లాట్‌ఫాంలో కనిపించబోతున్నాడు. 
 
ఈ ఆఫర్ వచ్చిన మొదట్లో అక్షయ్ దాన్ని నిరాకరించాడట. ఆ విషయాన్ని తెలుసుకున్న అక్షయ్ కొడుకు ఆరవ్ తండ్రిని ఒప్పించగలిగినట్లు సమాచారం. ఫలితంగా అక్షయ్ ప్రస్తుతం 90 కోట్ల రూపాయలు అందుకోనున్నాడు.
 
అమెజాన్ ప్రైమ్ చెప్పిన కాన్సెప్ట్ అక్షయ్ కొడుకు ఆరవ్‌కు బాగా నచ్చడంతో అతని కోరికమేరకే ఈ షో చేయడానికి ఒప్పుకున్నట్లు అక్షయ్ పేర్కొన్నాడు. ఈ యాక్షన్ అడ్వెంచర్ సిరీస్ షూటింగ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నట్లు అక్షయ్ తెలిపాడు. ఏదేమైనా అక్షయ్ కుమార్ కొడుకు మాట విని రూ.90 కోట్లు లాభపడ్డాడనే చెప్పుకోవాలి.