శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By కుమార్
Last Updated : గురువారం, 21 ఫిబ్రవరి 2019 (20:24 IST)

'కేసరి'గా రానున్న పక్షి రాజు

బాలీవుడ్ విలక్షణ నటుడు అక్షయ్ కుమార్ ప్రస్తుతం 'కేసరి' అనే ఒక హిస్టారికల్ మూవీలో నటిస్తున్నారు. అనురాగ్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని కరణ్ జోహార్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిలింస్, అజుర్ ఎంటర్‌టైన్‌మెంట్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 1891లో జరిగిన సారాగడి యుద్ధ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 
 
గురువారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసారు. విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ ట్రైలర్‌కు భారీ ఆదరణ వచ్చింది. 'నేను తన బానిసను అని, భారతీయులంతా మూర్ఖులని ఒక బ్రిటిష్ వ్యక్తి నాతో అన్నాడు. అలాంటి వారికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది' అనే డైలాగ్‌తో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. 'నేను ధరించిన తలపాగా కేసరి (కాషాయ రంగు), కారే నా రక్తం కేసరి' అనే డైలాగ్ చెప్తూ అక్షయ్ కుమార్ ఆకట్టుకున్నాడు.
 
ఈ సినిమాలో పరిణీతి చోప్రా కథానాయిక. సారాగడి ప్రాంతంలో కేవలం 21 మంది సిక్కులకు పదివేల మంది ఆఫ్ఘానీయులతో యుద్ధం జరుగుతుంది. అసలు ఆ యుద్ధం ఎందుకు సంభవించింది, ఆ తర్వాత ఏమి జరిగిందనేదే ఈ చిత్రం కథ. ఈ ట్రైలర్‌లో చూపిన పోరాట సన్నివేసాలు చాలా బాగున్నాయని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.