మోటోరోలా నుండి మోటో జీ7... ఆకట్టుకునే ఫీచర్లు

మోహన్| Last Updated: సోమవారం, 25 మార్చి 2019 (17:37 IST)
మోటోరోలా నుండి విడుదలైంది..
 
మొబైల్స్ తయారీదారు సంస్థ మోటోరోలా సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. మోటోరోలా సంస్థ ఈ స్మార్ట్‌ఫోన్‌ని భారత్‌లో మోటో జీ7 పేరుతో ఇవాళ విడుదల చేసింది. ఈ ఫోన్ వినియోగదారులకు రూ.16,999 ధ‌రకు లభిస్తుంది. ఈ మొబైల్‌లో పలు ఆకట్టుకునే ఫీచర్లు పొందుపరచబడ్డాయి. మోటో జీ7 ప్రత్యేకతలను ఓసారి చూడండి. 
 
మోటో జీ7 ఫీచర్లు:
*6.24 అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే, 
*2270 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 
*గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్ష‌న్‌, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 632 ప్రాసెస‌ర్‌, 
*4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, 
*డ్యుయ‌ల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 
 
*వాట‌ర్ రీపెల్లెంట్ పీ2ఐ కోటింగ్‌, 
*12, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 
*ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, 
*బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ట‌ర్బో చార్జింగ్ సదుపాయం కలదు‌.దీనిపై మరింత చదవండి :