1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 13 ఏప్రియల్ 2018 (16:28 IST)

ఎయిర్‌టెల్ ఫ్రీ డేటా ఆఫర్... ఎలాగంటే...

తన మొబైల్ వినియోగదారులకు ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ ఉచిత డేటా ఆఫర్‌ను ప్రకటించింది. 'మేరా పెహలా స్మార్ట్‌ఫోన్' పేరిట బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ అఫర్ ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే.

తన మొబైల్ వినియోగదారులకు ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ ఉచిత డేటా ఆఫర్‌ను ప్రకటించింది. 'మేరా పెహలా స్మార్ట్‌ఫోన్' పేరిట బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ అఫర్ ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే. ఇందుకోసం వాడే మొబైల్ ఫోన్ నుంచి  51111 అనే టోల్ ఫ్రీ నంబరుకు కాల్ చేసి తెలుసుకోవాల్సి ఉంది.
 
కాగా, ఈ ఆఫర్‌లో భాగంగా 2జీ లేదా 3జీ ఫోన్లు వాడుతున్న ఎయిర్‌టెల్ వినియోగదారులు 4జీ స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్ అయితే 30 జీబీ డేటాను ఉచితంగా పొందవచ్చు. ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ వినియోగాదారులైతే రోజుకి 1జీబీ చొప్పున 30 రోజులకు 30 జీబీ రానుండగా, ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు ఒకేసారి 30 జీబీ డేటా ఉచితంగా రానుంది.