1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 3 మార్చి 2018 (18:54 IST)

''జియోఫై'' వినియోగదారుల కోసం రిలయన్స్ బంపర్ ఆఫర్

దేశంలో ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో తాజాగా కొత్త ఆఫర్‌ని ప్రవేశపెట్టింది. జియో తన ''జియోఫై'' డివైస్ వినియోగదారుల కోసం బంపర్ ఆఫర్‌ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా రూ.1999కి జియోఫై ప

దేశంలో ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో తాజాగా కొత్త ఆఫర్‌ని ప్రవేశపెట్టింది. జియో తన ''జియోఫై'' డివైస్ వినియోగదారుల కోసం బంపర్ ఆఫర్‌ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా రూ.1999కి జియోఫై పరికరాన్ని కొనుగోలు చేసిన వినియోగదారులకు రూ.3,595 విలువతో కూడిన ప్రయోజనాలను అందిస్తున్నట్లు తెలిపింది. 
 
ఈ ఆఫర్‌లో భాగంగా రోజుకు 1.5జీబీ లేదా 2జీబీ లేదా 3జీబీ డేటా ప్లాన్లను ఎంపిక చేసుకునే అవకాశం వుంటుందని రిలయన్స్ జియో తెలిపింది. అలాగే.. ఈ ఆఫర్ కింద రూ.1,295 డేటా రూపంలో లభిస్తుంది. మిగతా రూ.2,300 వోచర్ల రూపంలో లభిస్తాయని.. వీటిని పేటీఎం, ఏజీయో, రిలయన్స్ డిజిటల్ షాపింగ్‌ల్లో ఉపయోగించుకోవచ్చునని రిలయన్స్ జియో ఓ ప్రకటనలో వెల్లడించింది. 
 
మరోవైపు రిలయన్స్ జియో తమ ప్రైమ్ మెంబర్ల కోసం మోర్ దాన్ వంద శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ గడువును మార్చి 15వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఇందులో వినియోగదారులకు రూ.700 వరకు విలువైన క్యాష్ బ్యాక్ లభిస్తుంది. కానీ వినియోగదారులు రూ.398 లేదా ఆపై విలువ గల ప్లాన్లను రీఛార్జ్ చేసుకుంటే.. 100 శాతం క్యాష్ బ్యాక్ వస్తుంది.