శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 20 సెప్టెంబరు 2017 (18:46 IST)

'జియో ఫై' కావాలా నాయనా...? రూ. 1999 కాదు... 999 రూపాయలకే...

దసరా పండుగ సందర్భంగా జియో మరో సూపర్ ఆఫర్‌ను ప్రకటించింది. జియో ఫై కేవలం 999 రూపాయలకే ఇస్తున్నట్లు తెలిపింది. ఇప్పటివరకూ దీని ధర రూ. 1999గా వున్నది. ఏకంగా 1000 రూపాయల తగ్గింపు ధరను ప్రకటించి దసరా పండుగ సందర్భంగా JioFi 4జీ హాట్‌స్పాట్ పరికరంపై ప్రత్యేక

దసరా పండుగ సందర్భంగా జియో మరో సూపర్ ఆఫర్‌ను ప్రకటించింది. జియోఫై కేవలం 999 రూపాయలకే ఇస్తున్నట్లు తెలిపింది. ఇప్పటివరకూ దీని ధర రూ. 1999గా వున్నది. ఏకంగా 1000 రూపాయల తగ్గింపు ధరను ప్రకటించి దసరా పండుగ సందర్భంగా JioFi 4జీ హాట్‌స్పాట్ పరికరంపై ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించి ప్రత్యర్థి కంపెనీల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. 
 
కాగా ఈ ఆఫర్ సెప్టెంబర్ 20 నుంచి 30 వరకు ఉంటుందని తెలిపింది. మరోవైపు ఇప్పటికే తమ వినియోగదారులుగా వున్న జియో కస్టమర్లకు స్పెషల్ అలెర్టులను పంపుతోంది. జియో వైఫై 4జీ ఫోను లేకపోయినా 4జీ వేగంతో డేటా మరియు కాలింగ్ సదుపాయాలు కల్పిస్తుంది. దీన్ని ఎంచక్కా జేబులో పెట్టుకుని వెళ్లవచ్చు.