శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 10 ఏప్రియల్ 2018 (12:45 IST)

వ్యక్తిగత గోప్యత కావాలా? డబ్బు చెల్లించాలంటున్న ఫేస్‌బుక్?

ఫేస్‌బుక్ యూజర్ల చెవికి ఓ చేదువార్త ఒకటి చేరింది. ఫేస్‌బుక్‌లో వ్యక్తిగత గోప్యత కాపాడుకోవాలనుకునేవారు డబ్బు చెల్లించాల్సి ఉంటుందని ఆ సంస్థ యాజమాన్యం సూచన ప్రాయంగా వెల్లడించింది.

ఫేస్‌బుక్ యూజర్ల చెవికి ఓ చేదువార్త ఒకటి చేరింది. ఫేస్‌బుక్‌లో వ్యక్తిగత గోప్యత కాపాడుకోవాలనుకునేవారు డబ్బు చెల్లించాల్సి ఉంటుందని ఆ సంస్థ యాజమాన్యం సూచన ప్రాయంగా వెల్లడించింది. ఈ విషయాన్ని ఆ సంస్థ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ షెరిల్‌ శాండ్‌ బర్గ్‌ అభిప్రాయపడ్డారు. సాధారణంగా ఫేస్‌బుక్‌ యూజర్లకు రకరకాల వాణిజ్య ప్రకటనలు వస్తూంటాయి. డబ్బు తీసుకొని యూజర్లకు సంబంధించిన కొన్ని ప్రాథమిక వివరాలను ఫేస్‌బుక్‌ సంస్థ ఆ ప్రకటనలిచ్చే సంస్థలకు అందజేస్తోందని, అంటే యూజర్ల డేటాతో ఫేస్‌బుక్‌ సంస్థ వ్యాపారం చేస్తోందని అనేక కథనాలు వెలువడ్డాయి. 
 
దీనిపై షెరిల్‌ వివరణ ఇచ్చారు. 'మేం డేటాను ఏ వాణిజ్యసంస్థకూ అమ్మడం లేదు. అడ్వర్టయిజర్లకు మేం యూజర్ల వ్యక్తిగత డేటాను అందజేస్తున్నామన్న ఆరోపణ నిజం కాదు. జరిగేదేమంటే - మా వద్దకు ప్రకటనకర్తలు వస్తారు. నిర్దిష్టమైన అంశానికి సంబంధించి, ఫలానా వయసు వారికి లేదా ఫలానా దేశం వారికి, నిర్దిష్టమైన పరిమితిలో మా ప్రకటనలు పంపాలనుకుంటున్నామన్న ప్రతిపాదన మా ముందు పెడుతుంది. వీటిని టార్గెటెడ్‌ యాడ్స్‌ అంటాం. చిన్న చిన్న వ్యాపారాలకు, ఆ వాణిజ్య సంస్థలకు ఈ రకమైన ప్రకటనలు అత్యవసరం. మేం వాటిని స్వీకరిస్తాం. వారు కోరిన అంశం, ఏజ్‌ గ్రూప్‌ ఉన్న వారి డేటాను వారికి చూపిస్తాం తప్ప ఏ రకమైన డేటానూ మేం ప్రకటనకర్తలకు పంపించం' అని ఆమె విశదీకరించారు.