శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 31 మార్చి 2018 (09:08 IST)

జియో యూజర్లకు తీపికబురు.. మరో యేడాది ఉచితం

జియో యూజర్లకు ఆ సంస్థ యాజమాన్యం తీపికబురు చెప్పింది. మరో యేడాది పాటు ఉచితంగా సేవలు పొందే వెసులుబాటును కల్పించింది. నిజానికి జియో ప్రైమ్ సభ్యత్వం 2018 మార్చి 31వ తేదీతో ముగియనుంది.

జియో యూజర్లకు ఆ సంస్థ యాజమాన్యం తీపికబురు చెప్పింది. మరో యేడాది పాటు ఉచితంగా సేవలు పొందే వెసులుబాటును కల్పించింది. నిజానికి జియో ప్రైమ్ సభ్యత్వం 2018 మార్చి 31వ తేదీతో ముగియనుంది. దీంతో ఈ సభ్యత్వాన్ని రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంది. అయితే, అలాంటి అవకాశమే లేకుండా మరో యేడాది పాటు జియో ప్రైమ్‌ సర్వీసులను ఉచితంగా పొందవచ్చని తెలిపింది. 
 
ఇప్పటికే ప్రైమ్‌ సభ్యులుగా ఉన్నవారు ఎలాంటి రుసుము చెల్లించకుండా మరో ఏడాది (మార్చి2019) వరకు ఆ సేవలను పొందవచ్చని తెలిపింది. కొత్తగా జియో కనెక్షన్‌ తీసుకున్న వారు ఈ నెల 31 కంటే ముందు రూ.99 చెల్లించి మెంబర్‌ షిప్‌ తీసుకుంటే ఏడాది పాటు ప్రైమ్‌ ప్రయోజనాలను పొందవచ్చని తెలిపింది. 
 
దీని కోసం యూజర్లు మై జియో యాప్‌‌లోకి వెళ్లి కాంప్లిమెంటరీ మెంబర్‌షిప్‌ కోసం రిజిస్టర్‌ చేసుకోవాలని తెలిపింది. ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ ఉన్న వాళ్లు లైవ్‌ టీవీ ఛానళ్లు, సినిమాలు, వీడియోలు, పాటలు, మ్యాగజైన్స్‌ సంబంధిత కంటెంట్‌‌ను ఉచితంగా యాక్సెస్‌ చేయవచ్చు. 2018 జనవరి నాటికి జియో వినియోగదారులు 17.5 కోట్లకు చేరుకున్నట్లు ఇటీవల జియో ప్రకటించిన విషయం తెలిసిందే.