శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 3 అక్టోబరు 2018 (14:21 IST)

దసరా పండుగ.. మోటరోలా బంపర్ ఆఫర్.. ధరల తగ్గింపు

దసరా పండుగను పురస్కరించుకుని టెలికాం రంగ సంస్థలన్నీ పోటీపడి ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. దసరాను పురస్కరించుకుని తాజాగా మోటరోలా బంపర్ ఆఫర్ ప్రకటించింది. మోటో ఈ5 ప్లస్,మోటో ఎక్స్4 ఫోన్ ధరలను ఫెస్టివల్ ఆఫర్‌

దసరా పండుగను పురస్కరించుకుని టెలికాం రంగ సంస్థలన్నీ పోటీపడి ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. దసరాను పురస్కరించుకుని తాజాగా మోటరోలా బంపర్ ఆఫర్ ప్రకటించింది. మోటో ఈ5 ప్లస్,మోటో ఎక్స్4 ఫోన్ ధరలను ఫెస్టివల్ ఆఫర్‌గా తాత్కాలికంగా తగ్గించినట్లు సంస్థ తెలిపింది. మోటో ఈ5 ప్లస్ కాస్ట్ రూ.11,999 ఉండగా ప్రస్తుతం ఆ ఫోన్ రూ.10,999కే లభిస్తుంది. 
 
మోటో ఎక్స్4 3 జీబీ ర్యామ్ వేరియంట్ కాస్ట్ రూ.15,999 ఉండగా రెండు వేలు ధర తగ్గడంతో ఆ ఫోన్ ఇప్పుడు రూ.13,999కే లభిస్తుంది. ఇదే ఆఫర్ మోటో ఎక్స్4.. 4 జీబీ ర్యామ్ వేరియంట్‌కు వర్తిస్తుందని తెలిపింది.
 
మరోవైపు బీఎస్ఎన్ఎల్ కొత్త ఆఫర్ ప్రకటించింది. పోస్ట్ పెయిడ్, బ్రాడ్ బ్యాండ్ సర్వీసులు వాడుతున్న వారికి ఈ- కామర్స్ సైట్ అమెజాన్‌తో కలిసి తన కస్టమర్లకు ఏడాది పాటు ఫ్రీగా అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్‌ను బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది. రూ.399 పోస్ట్ పెయిడ్ ప్లాన్ లేదా రూ.745 ఆ పైన విలువ గల బ్రాడ్ బ్యాండ్ ప్లాన్‌లను యూజ్ చేస్తున్న కస్టమర్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.