సంబంధిత వార్తలు
- ఆధార్ రాజ్యాంగబద్ధమే... కానీ తప్పనిసరికాదు : సుప్రీంకోర్టు
- అద్దె ఇళ్లు.. ఆధార్‌లో అడ్రెస్ మార్చుకోవాలంటే..? secret pin ద్వారా?
- ప్రధాని నరేంద్ర మోడీకి ఫ్రెంచి ఎథికల్ హ్యాకర్ సవాల్...
- ఆధార్-పాన్ కార్డు లింకు-మార్చి 31, 2019 వరకు గడువు పొడిగింపు
- అడిగినా చెప్పొద్దు... అది లేకుండానే సిమ్ తీసుకోండి...
కస్టమర్ ఐడెంటిటీ కోసం ఆధార్ వద్దు.. డీ లింక్ చేయండి...
దేశంలోని టెలికాం కంపెనీలకు యూఐడీఏఐ ఓ గడువు విధించింది. మొబైల్ వినియోగదారుల ఐడెంటిటీ కోసం తీసుకున్న ఆధార్ కార్డులను డీ లింక్ చేయాలని ఆదేశించింది. అలాగే, ఇకపై వినియోగదారుడి గుర్తింపు కోసం ఆధార్ గుర్తింప
దేశంలోని టెలికాం కంపెనీలకు యూఐడీఏఐ ఓ గడువు విధించింది. మొబైల్ వినియోగదారుల ఐడెంటిటీ కోసం తీసుకున్న ఆధార్ కార్డులను డీ లింక్ చేయాలని ఆదేశించింది. అలాగే, ఇకపై వినియోగదారుడి గుర్తింపు కోసం ఆధార్ గుర్తింపు కార్డును సేకరించరాదని స్పష్టంచేసింది.
టెలికాం కంపెనీలు ఇక నుంచి ఆధార్‌ను వాడుకోరాదు అని ఇటీవల సుప్రీంకోర్టు తన తీర్పులో వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఆయా టెలింకాం కంపెనీలకు యూఐడీఏ ఈ డెడ్‌లైన్‌ను విధించింది.
నిన్నామొన్నటివరకు కొన్ని కంపెనీలు ఐడెంటీ కోసం ఆధార్‌ను కస్టమర్ల నుంచి సేకరించేవి. అయితే ఆ ప్రక్రియను ఆపేయాలని భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియా సంస్థలకు సోమవారం యూఐడీఏఐ ఆదేశాలు జారీచేసింది.
అక్టోబరు 15వ తేదీ వరకు ఆధార్ డేటా ఆధారంగా కస్టమర్ సమాచారాన్ని సేకరించే ప్రక్రియ స్థానంలో చేపట్టే కొత్త విధానం గురించి తెలియజేయాలని యూఐడీఏఐ పేర్కొంది.
