శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 2 ఆగస్టు 2018 (12:14 IST)

అద్దె ఇళ్లు.. ఆధార్‌లో అడ్రెస్ మార్చుకోవాలంటే..? secret pin ద్వారా?

ఆధార్‌లో అడ్రెస్ మార్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఇక ఆ పని సులభం కానుంది. అద్దె ఇళ్లల్లో నివసించేవారు ఆధార్‌లో చిరునామా మార్చుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. తాజాగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా

ఆధార్‌లో అడ్రెస్ మార్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఇక ఆ పని సులభం కానుంది. అద్దె ఇళ్లల్లో నివసించేవారు ఆధార్‌లో చిరునామా మార్చుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. తాజాగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆధార్ అడ్రస్‌ను సులభంగా మార్చుకునే విధానాన్ని భారత విశిష్ఠ గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) నిర్ణయించింది. దీని కోసం కొత్త సర్వీసును అందుబాటులోకి తీసుకువస్తోంది.
 
2019 ఏప్రిల్‌ ఒకటి నుంచి ఈ సేవలు అమల్లోకి వస్తాయి. సరైన అడ్రస్‌ ప్రూఫ్‌ ఉన్న వాళ్లు ఆ వివరాలను ఆధార్‌ సెంటర్లో సమర్పించి అడ్రస్ మార్చుకోవచ్చు. అడ్రస్ ప్రూఫ్ లేనివారు కూడా ఆ అడ్రస్‌కు పంపే ''రహస్య పిన్''ను ఆధార్‌ కేంద్రంలో, ఎస్ఎస్‌యూపీ ఆన్‌లైన్‌ పోర్టల్‌లో పొందుపరిచి అడ్రస్‌ను మార్చుకోవచ్చని యూఐడీఏఐ వెల్లడించింది. 
 
ఆధార్‌లో సరైన అడ్రస్‌ లేనందున వలస కార్మికులు, అద్దె ఇళ్లలో ఉండేవారు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కొత్త సర్వీసు ఆధారంగా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. దీనికోసం జనవరి 1, 2019 నుంచి పైలట్‌ ప్రాజెక్టు చేపట్టనున్నారు.