1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. Reliance Jio now offers 4.5 Gb data per day for Rs 299

జియో మరో బంపర్ ఆఫర్... రోజూ 4.5జీబీ డేటా ఫ్రీ

టెలికాం రంగ సంచలనం రిలయన్స్ జియో మరో బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. తమ మొబైల్ వినియోగదారులు అడక్కుండానే రోజుకు 4.5జీబీ డేటాను ఉచితంగా ఇవ్వనుంది. అయితే, ఈ డేటా పొందాలంటే నెలకు రూ.299 ప్లాన్‌లో రీచార్జ్ చే

Reliance Jio
టెలికాం రంగ సంచలనం రిలయన్స్ జియో మరో బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. తమ మొబైల్ వినియోగదారులు అడక్కుండానే రోజుకు 4.5జీబీ డేటాను ఉచితంగా ఇవ్వనుంది. అయితే, ఈ డేటా పొందాలంటే నెలకు రూ.299 ప్లాన్‌లో రీచార్జ్ చేయించుకోవాల్సి ఉంది. ఈ ప్యాక్ కాలపరిమితి 28 రోజులు.
 
అంటే నెలకు రూ.299 ప్యాక్ తీసుకుంటే.. 28 రోజులపాటు ప్రతిరోజు 4.5జీబీ డేటా లభించనుంది. మొత్తంగా 126జీబీ డేటా పొందనున్నారు కస్టమర్లు. మరి ఏ ఇతర కంపెనీ నెట్ వర్క్‌లోనూ ఈ ప్యాక్ రేటులో ఇంత డేటా ఇస్తున్న దాఖలాలు లేవు. డేటా ఎక్కువ ఉపయోగించుకునే వారికి జియోలో ఇది బెస్ట్ ప్యాక్ అంటోంది మార్కెట్. 
 
ఈ ఆఫర్‌ ప్రకటించడానికి గల కారణాలు లేకపోలేదు. త్వరలోనే ఐడియా - వోడాఫోన్ టెలికాం కంపెనీలు ఒక్కటి కానున్నాయి. ఇదే జరిగితే టెలికాం రంగంలో ఐడియా అతి పెద్ద కంపెనీగా అవతరించనుంది. దీంతో ధరల యుద్ధం మరోసారి తెరపైకి వచ్చింది. ఐడియా-వొడాఫోన్ విలీనం పూర్తయ్యిందన్న సమాచారం తెలిసిన వెంటనే జియే ఈ తరహా ఆఫర్‌ను ప్రకటించడం గమనార్హం. 
About Writer
pnr
తర్వాతి కథనం
ఐపీఎస్ అధికారి అందానికి కాలేజీ విద్యార్థిని 'ఫిదా'.. పెళ్లి చేసుకుంటానని నానాయాగీ