రిలయన్స్ జియోకు పోటీ- రూ.597తో ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్

దేశ వ్యాప్తంగా ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియోకు పోటీగా టెలికాం సంస్థలన్నీ పోటీపడి ఆఫర్లు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎయిర్‌టెల్ మరో కొత్త ప్యాక్‌ను కస్టమర్లకు తీసుకొచ్చింది.

airtel
selvi| Last Updated: సోమవారం, 18 జూన్ 2018 (12:46 IST)
దేశ వ్యాప్తంగా ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియోకు పోటీగా టెలికాం సంస్థలన్నీ పోటీపడి ఆఫర్లు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎయిర్‌టెల్ మరో కొత్త ప్యాక్‌ను కస్టమర్లకు తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా పలు సర్కిల్స్ లో రూ.597తో కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. కేవలం వాయిస్ కాల్స్‌ వినియోగదారులను దృష్టిలో వుంచుకుని ఎయిర్‌టెల్ ఈ ప్లాన్‌ను ఆవిష్కరించింది. 
 
ఇందులో భాగంగా.. ఈ ప్లాన్ వాలీడిటీని ఎయిర్‌టెల్ 168 రోజులుగా నిర్ణయించింది. ఈ ప్లాన్ కింద యూజర్లకు అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, 10 జీబీ డేటాను ఎయిర్‌టెల్ అందిస్తుంది. కాగా, గతంలో రూ.995 రీచార్జ్ ప్యాక్ తెచ్చిన ఎయిర్‌టెల్... 6 నెలల కాలవ్యవధితో అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, మొత్తం 6 జీబీ డేటా... అంటే నెలకు 1 జీబీ చొప్పున వాడుకునే వీలు కల్పించిన సంగతి తెలిసిందే.దీనిపై మరింత చదవండి :