సోమవారం చంద్రుడిని ఇలా పూజిస్తే..?
సోమవారం చంద్రుడిని, పరమేశ్వరుడిని పూజించాలి. అడగగానే వరాలనందించే బోళాశంకరుడిని, మనః కారకుడు అయిన చంద్రుడిని ప్రసన్నం చేసుకోవాలంటే.. సోమవారం పూజ చేయాలి. శ్రావణ, వైశాఖ, కార్తీక, మార్గశిర మాసాల్లో శుక్ల
సోమవారం చంద్రుడిని, పరమేశ్వరుడిని పూజించాలి. అడగగానే వరాలనందించే బోళాశంకరుడిని, మనః కారకుడు అయిన చంద్రుడిని ప్రసన్నం చేసుకోవాలంటే.. సోమవారం పూజ చేయాలి. శ్రావణ, వైశాఖ, కార్తీక, మార్గశిర మాసాల్లో శుక్లపక్ష సోమవారంనాడు ఈ పూజను ప్రారంభించి.. 16 లేదా ఐదు వారాలైనా ఈ వ్రతాన్ని ఆరంభించాలి. సోమవారం సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించాలి. ''నమఃశ్శివాయ'' అని స్మరించుకుంటూ స్నానం చేయాలి.
శివపార్వతుల అష్టోత్తరం, అర్ధనారీశ్వర స్తోత్రం చేస్తూ తెల్లటి పువ్వులు, శ్వేత గంధం, బియ్యంతో చేసిన పిండి వంటలు, పంచామృతాలు, శ్వేతాక్షతలు, గంగాజలం, బిల్వపత్రాలతో పూజించాలి. సోమవారం ఒంటి పూట ఉపవాసం ఉంటే మంచిది.
చంద్రగ్రహ ప్రతికూల ప్రభావం తొలగేందుకు తెలుపు వస్త్రాలు, ముత్యం పొదిగిన వెండి ఉంగరాన్ని ధరించాలి. పూజా సమయంలో చంద్రాష్టోత్తరాన్ని పఠించాలి. చివరివారంలో దంపతులకు భోజనం పెట్టి, చందన తాంబూలాలతో పాటు పాలు, పెరుగు, పండ్లు, తెలుపురంగు వస్తువులను దానం చేయాలి. ఇలా చేస్తే చంద్రగ్రహ దోషాలుండవని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. ఇంకా సిరిసంపదలు చేకూరుతాయని, దారిద్య్రం తొలగిపోతుందని వారు చెప్తున్నారు.