శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 9 ఆగస్టు 2019 (14:42 IST)

రోజా ఆటోగ్రాఫ్‌తో రోడ్డు పైకి కియా తొలి కారు... త్వరలో షోరూమ్‌లకు...

కియా మోటార్స్ అనంతపురం జిల్లా పెనుకొండలో నెలకొల్పిన ప్లాంట్ నుంచి తొలి కారు గురువారం రోడ్డెక్కింది. నారింజ, తెలుపు రంగులతో మిళితమైన ఈ సెల్టోస్ కారును ఏపీ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, శంకర నారాయణ, హిందూపురం లోక్ సభ సభ్యుడు గోరంట్ల మాధవ్, విప్ కాపు రామచంద్రా రెడ్డి, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా చేతులు మీదుగా ఆవిష్కరించారు. ఈ తొలి కారుపై రోజా తన తొలి సంతకం చేశారు.
 
ఈ కియా సెల్టోస్ కారు దేశంలోని అన్ని షోరూమ్‌లకు వస్తాయని కంపెనీ ప్రతినిధి తెలిపారు. కాగా ఈ తొలికారును ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేతులు మీదుగా ఆవిష్కరించాలని కియా ప్రతినిధులు ఆహ్వానించారు. కానీ వరద ప్రభావిత ప్రాంతాలలో ఏరియల్ సర్వే చేస్తున్న కారణంగా ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. దానితో మంత్రుల చేతులు మీదుగా ఈ కారును లాంఛ్ చేశారు.