బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 8 ఆగస్టు 2019 (18:07 IST)

భర్త ఆర్మీ ఉద్యోగం, భార్య ఆటో డ్రైవరుతో వివాహేతర సంబంధం, బెడిసి కొట్టడంతో పొడిచి...

చిత్తూరు పట్టణంలోని దుర్గా నగర్ కాలనీలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. దుర్గా నగర్ కాలనీలో నివాసముంటున్న గీత అనే గృహిణిని అమీద్ అనే యువకుడు కత్తితో అతి కిరాతకంగా హతమార్చి తాను కూడా సంఘటనా స్థలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
గీత భర్త సురేష్ బాబు ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. భర్త దూరంగా ఉండటంతో గీతా అమీద్‌ల మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. గడిచిన కొద్ది రోజులుగా అమీద్‌ను దూరంగా పెట్టడంతో గురువారం నాడు అతడు గీత ఇంటికి చేరుకుని గొడవకు దిగాడు. 
 
ఇద్దరి మధ్యా ఘర్షణ తలెత్తడంతో గీతను అమీద్ అతి దారుణంగా హతమార్చి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అమీద్ ఆటో డ్రైవర్. ఇతనికి వివాహమై విడాకులు కూడా తీసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.