మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 27 జులై 2020 (11:19 IST)

#KGFChapter2 లేటెస్ట్ అప్‌డేట్.. జూలై 29న సర్‌ప్రైజ్.. ఏంటో అది?

KGF 2
రాక్ స్టార్, కన్నడ హీరో యశ్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం కేజీఎఫ్ 2. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తొలి పార్ట్ మంచి విజయం సాధించడంతో సీక్వెల్ ప్లాన్ చేశారు.

అక్రమ మైనింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కరోనాతో విడుదలకు నోచుకోలేదు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది. చాలావరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుండి జూలై 29 ఉదయం 10గం.లకి సర్‌ప్రైజ్ రానుందని మేకర్స్ ప్రకటించారు. 
 
ఈ సినిమాలో అగ్రనటులు నటిస్తున్నారు. కేజీఎఫ్ 2 చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నెగెటివ్ పాత్ర పోషిస్తున్నాడు. గత ఏడాది జూలై 29న సంజయ్ బర్త్‌డే సందర్భంగా అధీరా పాత్రకి సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు. ఇక ఈ ఏడాది కూడా సర్‌ప్రైజ్ ఇచ్చే ప్లాన్ చేశారు.  
 
ఇదిలా ఉంటే కేజీఎఫ్ 2 చిత్రంలో యశ్‌, సంజయ్ దత్‌ల మధ్య ఆసక్తికర పోరు ఒకటి ఉండనుందని అంటున్నారు. ఇది ప్రేక్షకులకి మంచి ట్రీట్ కాబోతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇంకా 25 రోజుల షూటింగ్ పూర్తి చేసుకోనున్న ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసే అవకాశం వుందా లేక థియేటర్లలో విడుదల చేస్తారా అనే ఇంకా తెలియాల్సి వుంది.