ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 22 జులై 2020 (20:38 IST)

శిఖ‌రాన్ని చూసి కుక్క ఎంత మొరిగినా..? నిఖిల్ ట్వీట్.. వర్మ ఊరుకుంటారా?

pawan kalyan
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు అభిమానులు ఎక్కువేనన్న సంగతి తెలిసిందే. ఇందులో నిఖిల్ సిద్ధార్థ ఒకరు. తాజాగా పవన్‌కు మద్దతిస్తూ.. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై సెటైర్లు విసిరాడు. 
 
తాజాగా రామ్‌గోపాల్ వ‌ర్మ‌ "ప‌వ‌ర్ స్టార్: ఎన్నిక‌ల్లో ఓడిపోయిన త‌ర్వాతి క‌థ"‌ పేరుతో సినిమా తీస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రం నుంచి 'గ‌డ్డి తింటావా?' సాంగ్‌ను రిలీజ్ చేయ‌గా తాజాగా ట్రైల‌ర్ లీకైపోయింది. ఇలా వర్మ పవన్‌ను టార్గెట్ చేయడంపై నిఖిల్ ఫైర్ అయ్యాడు. దీంతో వ‌ర్మ పేరెత్త‌కుండానే ఆయ‌న్ని కుక్క‌తో పోల్చుతూ మండిప‌డ్డారు. 
 
"శిఖ‌రాన్ని చూసి కుక్క ఎంత మొరిగినా.. ఆ మ‌హాశిఖ‌రం త‌ల తిప్పి చూడ‌దు. మీకు అర్థం అయిందిగా.." అంటూ ట్వీట్ చేశారు. దీనికి ప‌వ‌న్ కళ్యాణ్, ప‌వ‌ర్ స్టార్ హ్యాష్‌ట్యాగ్‌ల‌ను జోడించారు. దీంతో వ‌ర్మ‌కు తిక్క కుదిరిందంటూ ప‌వ‌న్ అభిమానులు సంతోష‌ప‌డుతుంటే వారి ఆనందాన్ని ఆవిరి చేస్తున్నారు మ‌రికొంద‌రు నెటిజ‌న్లు.
 
''అవును.. శిఖరం అంటే 120 స్థానాల్లో డిపాజిట్ గ‌ల్లంతు అవ‌డం ఏమో అనుకుంట‌', 'ఇప్పుడు ప‌వ‌ర్ స్టార్ ఫ్ల‌వ‌ర్ స్టార్ అయ్యాడు. అభిమానుల‌కు పెద్ద కాలీఫ్ల‌వ‌ర్ పెడ‌తాడు' అంటూ సెటైర్లతో కూడిన కామెంట్లు చేస్తున్నారు. ఇంత పెద్ద మాట‌న్నాక వ‌ర్మ నిమ్మ‌కు నీరెత్త‌న‌ట్టు ఊరుకుంటారా? అనేది వేచి చూడాలి.