గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 జులై 2020 (16:32 IST)

సుశాంత్ చివరి సినిమా ''దిల్‌ బేచారా'' ట్రైలర్ అదుర్స్... 69లక్షల వ్యూస్ (video)

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ చివరి సినిమా రికార్డుల పంట పండించేలా వుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌‌కు అనూహ్య స్పందన వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ ట్రైలర్ 69లక్షలకు పైగా వ్యూస్.. 10 మిలియన్ల పైగా లైక్స్ సొంతం చేసుకొని వరల్డ్ రికార్డు బద్దలు కొట్టింది. 
 
సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ చివరిగా నటించిన 'దిల్‌ బేచారా' ట్రైలర్‌ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. హాలీవుడ్ 'ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్' సినిమాకు రీమే‌క్‌గా ఈ సినిమా రూపొందించారు. ఈ సినిమాతో ముఖేష్ ఛాబ్రా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇక ఈ సినిమా జూలై 24న డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది.
 
ఈ సినిమాలో సుశాంత్‌కు జోడిగా సంజనా సంఘి నటించారు. ఇందులో సుశాంత్ నోటి నుంచి వచ్చే ప్రతీ డైలాగ్ ఆయన అభిమానుల్ని కట్టి పడేసింది. 'ఎలా పుట్టాలి ఎప్పుడు చావాలి అన్నది మనం డిసైడ్ చేయలేం.. కానీ ఎలా బతకాలన్నది మాత్రం మన చేతుల్లో ఉంది అంటూ' ట్రైలర్‌లో వినిపిస్తున్న సుశాంత్ డైలాగులు మరోసారి అభిమానుల కళ్ల నుంచి కన్నీళ్లు తెప్పించాయి. ప్రస్తుతం ఈ ట్రైలర్‌ను వీక్షించే వారి సంఖ్య అనూహ్యంగా పెరగుతోంది.