డిప్రెషన్‌లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోయిన్.. (video)
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య ఆయన కో స్టార్లను షాకిచ్చింది. దీంతో సుశాంత్ లేని లోటు తీరదని భావోద్వేగంతో పోస్టులు చేస్తున్నారు. ఆయన ఆత్మహత్యను నమ్మలేకపోతున్నారు. అతడి చిరునవ్వు ఇకలేదనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో సుశాంత్ చివరి చిత్రం 'దిల్ బేచారా'లో నటించిన హీరోయిన్ సంజనా సాంఘి తీవ్ర భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తోంది.
తాజాగా సంజనా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో... "బై ముంబై. నేను ఢిల్లీకి తిరిగి వెళ్లిపోతున్నాను. ఇక్కడి వీధులన్నీ వింతగా, కొత్తగా కనిపిస్తున్నాయి. నా గుండెల్లో నిండుకున్న బాధ కారణంతో నా చూపు కూడా మారిందేమో... వీధులన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి.
అలా కాకుంటే నీలో కూడా ఏదైనా బాధ ఉందేమో. త్వరలోనే మళ్లీ కలుస్తాం. లేకుంటే కలవలేకపోవచ్చు కూడా" అంటూ పోస్ట్ చేసింది. సంజనా మొదటిసారి హీరోయిన్‌గా నటించిన చిత్రం 'దిల్ బేచారా' ఓటిటిలో విడుదలవడం, సుశాంత్ మరణం వల్లనే ఆమె ఈ నిర్ణయం తీసుకునట్టు తెలుస్తోంది.
మరోవైపు బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసు దర్యాప్తు అనేక మలుపులు తిరుగుతున్నట్టు కనిపిస్తున్నది. ఈ కేసులో దాదాపు 28 మందిని ఇప్పటికే ప్రశ్నించడం తెలిసిందే. మంగళవారం రోజున దిల్ బేచారా హీరోయిన్‌ను సుమారు 10 గంటలపాటు ప్రశ్నించినట్టు వార్తలు వచ్చాయి.
ముంబై పోలీసులు మంగళవారం దిల్ బేచారా హీరోయిన్ సంజనా సంఘీని సుదీర్ఘంగా విచారించడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైనట్టు తెలుస్తున్నది. గతంలో మీటూ ఉద్యమం జరుగుతున్న సమయంలో సుశాంత్‌పై ఆరోపణలు సంజన చేయడం మీడియాలో చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. అయితే సుశాంత్‌పై తాను చేసినట్టు వచ్చిన మీటూ ఆరోపణలు అవాస్తవమని అప్పట్లో సంజన క్లారిటీ ఇచ్చేసింది.
ఈ నేపథ్యంలో సుశాంత్ కేసులో బాంద్రా పోలీసుల విచారణ అనంతరం ముంబై నుంచి ఢిల్లీకి వెళ్తూ ఎయిర్‌పోర్టు నుంచి తన ఇన్స్‌స్టాలో సెన్సేషనల్ పోస్టు పెట్టింది. ఇక ఎన్నడూ ముంబైకి తిరిగి రాకపోవచ్చు అంటూ సంచలన కామెంట్‌ను పోస్టు చేసింది.
ఇక సంజన సంఘీ, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కలిసి నటించిన దిల్ బేచారా చిత్రం విడుదలకు సిద్దమైంది. సుశాంత్ సింగ్ సూసైడ్ అనంతరం రిలీజ్ చేస్తున్న చివరి సినిమాగా దిల్ బేచారా మారబోతున్నది. ఈ చిత్రం ఓటీటీ ఫ్లాట్‌ఫాం డిస్నీ+హాట్‌స్టార్ జూలై 24 తేదీన రిలీజ్ కానుంది.