నీకు ఇష్టమైన అమ్మాయిని పెళ్లాడమని చెప్పా: హీరో సుశాంత్ తండ్రి

Susanth singh Rajput
ఐవీఆర్| Last Modified శుక్రవారం, 26 జూన్ 2020 (23:02 IST)
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ రాజ్‌పుత్ ఒత్తిడికి లోనై బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. అతడి మరణంపై తండ్రి కేకే సింగ్ ఉద్వేగానికి లోనయ్యారు. తన కుమారుడు ఇటీవల ఎంతో గుంభనంగా మారిపోయాడనీ, తన మనసులో వున్నది ఏమీ తమకు చెప్పలేదన్నారు.

అప్పటికీ తాము ఎన్నోసార్లు పెళ్లి చేసుకోమని సుశాంత్‌ను అడిగితే కరోనా, లాక్‌డౌన్‌ పరిస్థితుల నుంచి బయటపడ్డాకే నిర్ణయం తీసుకుంటా అని చెప్పాడన్నారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి లేదా మార్చిలో పెళ్లి చేసుకుంటానని తమతో చెప్పాడని గుర్తు చేసుకున్నారు. పెళ్లి విషయంలో తనకు నచ్చిన అమ్మాయినే పెళ్లాడాలని చెప్పామన్నారు.

ఐతే తనకు తెలిసినంతవరకూ నటి అంకిత లోఖండే తన కుమారుడి మనసులో వున్నదని అన్నారు. ఆమెతో తమ కుటుంబానికి పరిచయం ఉందని తెలిపారు. అంకిత చాలాసార్లు ముంబైతో పాటు తమ స్వస్థలం పట్నాలోని ఇంటికి కూడా వచ్చిందని పేర్కొన్నారు. ఐతే, ఆమధ్య ముంబై వెళ్లినప్పుడు కృతి సనన్‌ను కూడా కలిసినట్లు చెప్పారు. కానీ రియా చక్రవర్తి విషయం తనకు తెలియదన్నారు.దీనిపై మరింత చదవండి :