శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 25 జూన్ 2020 (16:41 IST)

'ధోనీ బయోపిక్' హీరో నటించిన చివరి చిత్రం రిలీజ్ ఎపుడంటే?

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఎంఎస్ ధోనీ బయోపిక్. ఈ చిత్రంలో హీరోగా నటించిన బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇటీవల బలవన్మరణానికి పాల్పడిన విషయం తెల్సిందే. ఈ యువ హీరో మృతితో ప్రతి ఒక్క సెలెబ్రిటీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అయితే, సుశాంత్ నటించిన చివరి చిత్రం దిల్ బెచారా. ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది. 
 
ముఖేశ్‌ ఛాబ్రా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంజనాసంఘి హీరోయిన్‌గా నటిస్తోండగా.. సైఫ్‌ అలీఖాన్‌ కీలకపాత్రలో నటించాడు. ఎట్టకేలకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్దమైంది. జులై 24వ తేదీన డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో దిల్‌ బెచారా విడుదల కానుంది. 
 
ప్రేమ, ఆశ, ముగింపులేని జ్ఞాపకాల సమ్మేళనం. అందరి మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే సుశాంత్‌ సినిమాను సెలబ్రేట్‌ చేసుకుంటూ జులై 24న మీ ముందుకొస్తుందని డిస్నీ హాట్‌స్టార్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. హాలీవుడ్‌ రొమాంటిక్‌ డ్రామా ది ఫాల్ట్‌కు రీమేక్‌గా దిల్‌ బెచారా తెరకెక్కింది.