సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 22 జూన్ 2020 (14:46 IST)

చిరంజీవి 'లూసిఫర్' చిత్రంలో అలనాటి హీరోయిన్ కీలక పాత్ర?

మలయాళంలో సూపర్ హిట్ అయిన 'లూసీఫర్' చిత్రాన్ని తెలుగులోకి మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేయనున్నారు. ఇందులో పలువురు కీలక నటీనటులు నటిస్తున్నారు. అయితే, తాజాగా సమాచారం మేరకు ఈ చిత్రంలో అలనాటి హీరోయిన్ సుహాసిని ఓ కీలక పాత్రలో పోషించనుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 
 
మోహన్ లాల్ హీరోగా మలయాళంలో వచ్చిన 'లూసిఫర్' అక్కడ మంచి విజయాన్ని సాధించింది. దీంతో తన తండ్రితో దీనిని రీమేక్ చేయడానికి హీరో రామ్ చరణ్ సన్నాహాలు చేస్తున్నాడు. 'సాహో' ఫేం సుజీత్ దీనికి దర్శకత్వం వహించనున్నాడు. 
 
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో మలయాళం ఒరిజినల్ లో మంజూ వారియర్ పోషించిన కీలక పాత్రకు టాలెంటెడ్ నటిని ఎంపిక చేయాలని భావించి, సుహాసినిని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఇక తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా స్క్రిప్టుకి మార్పులు చేర్పులు కూడా చేస్తున్నారు.
 
నిజానికి 80-90 కాలంలో చిరంజీవి - సుహాసినిలు కలిసి పలు చిత్రాల్లో నటించారు. వీరిద్దరూ నటించిన అనేక చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి కూడా. అయితే, ప్రస్తుతం లూసిఫర్ చిత్రంలోని పాత్ర డిమాండ్ మేరకు సుహాసిని ఎంపిక చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.