గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 23 జూన్ 2020 (10:48 IST)

సీనియర్ నటి ఉషారాణి కన్నుమూత.. 200 సినిమాలు.. బుల్లితెరపై కూడా..

USha Rani
గతకొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన సీనియర్ నటి ఉషారాణి (65) కన్నుమూశారు. ఆదివారం నాడు చెన్నైలోని ఓ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఆమె కొద్ది రోజుల పాటు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారని ఆమె సన్నిహితులు తెలిపారు. 
 
తెలుగు, తమిళ భాషల్లో దాదాపు 200వరకు చిత్రాల్లో నటించిన ఆమె దక్షిణాదిలో మంచి నటిగా గుర్తింపు పొందారు. ఉషారాణి మృతికి పృథ్వీరాజ్ సుకుమారన్, టొవినో థామస్, జయసూర్య వంటి మాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
 
కాగా ఎన్నై పోల్ ఒరువన్, మన్నవ, పాత్రమ్, హిట్లర్, స్వర్ణ కిరీడం, మలయేథుమ్ మున్పె, కన్మదం వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఉషారాణి కొన్ని టీవీ సిరియళ్లలోనూ నటించి బుల్లితెరపై అభిమానులను సంపాదించుకున్నారు. 2004లో చివరిసారి మైలాటం అనే సినిమాలో కనిపించారు. మలయాళ దర్శకుడు, దివంగత శంకర్ నాయర్‌ను 1971 సంవత్సరంలో ఆమె వివాహం చేసుకున్నారు.