శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 25 జూన్ 2020 (16:47 IST)

సుశాంత్ చివరి సినిమా దర్శకుడి భావోద్వేగం

Sushant Singh Rajput
బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చివరి సినిమా గురించి చర్చ సాగుతోంది. సుశాంత్‌సింగ్‌ నటించిన చివరి చిత్రం 'దిల్‌ బెచారా'. హాలీవుడ్‌ రొమాంటిక్‌ డ్రామా ది ఫాల్ట్‌కు రీమేక్‌గా దిల్‌ బెచారా తెరకెక్కింది. 
 
ముఖేశ్‌ ఛాబ్రా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంజనాసంఘి హీరోయిన్‌గా నటించగా, సైఫ్‌ అలీఖాన్‌ కీలకపాత్రలో నటించాడు. ఎట్టకేలకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమైంది. జులై 24న డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో దిల్‌ బెచారా విడుదల కానుంది.
 
ప్రేమ, ఆశ, ముగింపులేని జ్ఞాపకాల సమ్మేళనం. అందరి మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే సుశాంత్‌ సినిమాను సెలబ్రేట్‌ చేసుకుంటూ జులై 24న మీ ముందుకొస్తుందని డిస్నీ హాట్‌స్టార్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. ఇంకేముంది.. సుశాంత్‌ చివరి సినిమాను హాట్ స్టార్‌లో చూసేందుకు ఆయన ఫ్యాన్స్ ఎగబడుతున్నారు.
 
ఈ సినిమాపై చిత్ర దర్శకుడు ముఖేష్ మాట్లాడుతూ.. ''సుశాంత్ నా తొలి చిత్రానికి హీరో మాత్రమే కాదు. నాకు అండగా నిలిచిన ప్రియమైన స్నేహితుడు. మేము కై పో చే నుండి దిల్ బెచారా వరకు మా జర్నీ కొనసాగింది. అతను నా తొలి చిత్రంలో నటిస్తానని వాగ్దానం చేశాడు. కలిసి చాలా ప్రణాళికలు రూపొందించాం. చాలా కలలు కలలు కన్నాం. కాని ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నేను ఒంటరిగా మిగిలిపోతానని ఊహించలేదు. నాపై ఎప్పుడూ అపారమైన ప్రేమను కనబరిచాడు. ఈ సినిమా మొత్తం కలిసి పనిచేశాం. కానీ సినిమా విడుదల చేస్తున్నప్పుడు అతని ప్రేమ మాకు మార్గనిర్దేశం చేస్తుంది'' అంటూ వ్యాఖ్యానించాడు.