శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 18 జూన్ 2020 (12:20 IST)

సుశాంత్.. అవకాశముంటే.. నీ బాధను నేను తీసుకునేదాన్ని!

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బలవన్మరణం చెందిన నేపథ్యంలో.. సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం పాట్నాలో తన ఫ్యామిలీతో ఉన్న ఆమె... ''నువ్వెంత బాధ అనుభవించావో నాకు తెలుసు. అవకాశముంటే నీ బాధని నేను తీసుకొని సంతోషాన్ని ఇచ్చే దాన్ని'' అని రాసింది.
 
సారీ మేరా సోనా.. నువ్వు ఎంతో బాధలో ఉన్నావని, పోరాట యోధుడిలా పోరాడుతున్నావని నాకు తెలుసు. నువ్వు ఇన్నాళ్లు అనుభవించిన బాధలకి నేను క్షమాపణలు కోరుతున్నాను. నాకే ఛాన్స్ ఉండి ఉంటే బాధలని నేను తీసుకునే దాన్ని అంటూ చెప్పుకొచ్చింది. ఎక్కడున్నా.. నిన్ను అందరూ ఇష్టపడతారు. ఇది కిష్టమైన సమయం అని తనకు తెలుసునని చెప్పుకొచ్చింది. 
 
ద్వేషం కన్నా ప్రేమని ఎంపిక చేసుకోండి. స్వార్థం కంటే నిస్వార్థతను ఎన్నుకోండి, ఇతరులను క్షమించండి . ప్రతి ఒక్కరినీ ప్రేమించండి. ద్వేషానికి బదులు ప్రేమ, ఆప్యాయత పంచండి. ఎందుకుంటే ప్రతి ఒక్కరూ తమ సమస్యలతో పోరాడుతున్నారు. మీ హృదయాన్ని ప్రేమతో నింపండి అని సుశాంత్ సోదరి తన పోస్ట్‌లో పేర్కొంది