శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 జూన్ 2020 (17:06 IST)

బాలీవుడ్‌లో హీరోయిన్ కావాలంటే.. పార్టీలకు వెళ్ళాల్సిందే... శ్రద్ధాదాస్

బాలీవుడ్ చిత్ర పరిశ్రమపై టాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా దాస్ ఏకిపారేసింది. హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ సినీ పరిశ్రమలో ఎలాంటి పరిస్థితులు వున్నాయో చాలామంది సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు. పైకి కనిపించేంత అందంగా బాలీవుడ్ కానీ, అక్కడి వ్యక్తుల మనసులు కానీ ఉండవని చెప్తున్నారు. దీనిపై శ్రద్ధాదాస్ కూడా స్పందించింది. 
 
బాలీవుడ్‌లో వాడే దుస్తులు, షూస్, సెలూన్, స్టయిలిస్ట్, పీఆర్, కార్లు తదితర ఖర్చులను మిడిల్ క్లాస్ నుంచి వచ్చినవాళ్లు భరించలేరని చెప్పింది. వీటిని మెయింటైన్ చేయడం చాలా కష్టమవుతుందని... అసలు ఈ రంగంలోకి ఎందుకొచ్చామా? అని అనిపిస్తుందని తెలిపింది. బాలీవుడ్‌లో పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని వెల్లడించింది.
 
సినిమా బ్యాక్ గ్రౌండ్ లేనివారు బాలీవుడ్‌లో నిలబడటం చాలా కష్టమని శ్రద్ధాదాస్ వెల్లడించింది. మధ్య తరగతి నుంచి వచ్చే వాళ్లు ఇండస్ట్రీలో ఎదగలేరని స్పష్టం చేసింది. బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎదగాలనుకుంటే పార్టీలకు వెళ్లాల్సి ఉంటుందని తెలిపింది. 
 
బాంద్రా, జుహూ ప్రాంతాల్లో ఉండే ఖరీదైన క్లబ్ లకు వెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అక్కడున్న వారితో స్నేహంగా మెలగాలని తెలిపింది. మేల్ యాక్టర్లకు కూడా ఇవే ఇబ్బందులు ఉంటాయని చెప్పింది. పీఆర్ మేనేజర్లు డబ్బులు తీసుకుని కూడా పార్టీలకు వెళ్లమనే సూచిస్తారని తెలిపింది.