శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 25 జూన్ 2020 (22:39 IST)

బీహార్ రాష్ట్రంలో 83 మందిని పొట్టనబెట్టుకున్న పిడుగులు

ఇటీవలి కాలంలో పిడుగుల పడి మరణించేవారి సంఖ్య అధికమవుతోంది. గురువారం నాడు బీహార్ రాష్ట్రాన్ని పిడుగుల వాన అతలాకుతలం చేసింది. ఆకాశం నుంచి నిప్పు రవ్వల మాదిరిగా భారీ శబ్దం చేస్తూ పడిన పిడుగులు ధాటికి రాష్ట్రంలో 83 మంది మృత్యువాత పడినట్లు బీహార అధికార వర్గాలు వెల్లడించాయి.
 
పిడుగల ధాటికి అత్యధికంగా బీహారు రాష్ట్రంలోని గోపాల్ గంజ్ జిల్లాలో 13 మంది మృత్యువాత పడ్డారు. పిడుగులు పడి ప్రజలు మృతి చెందడంపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పిడుగుపాటుతో మృతి చెందిన కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.