శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 2 జూన్ 2020 (20:05 IST)

క్వారంటైన్ సెంటర్లలో మాస్కులు ఇవ్వలేదట.. కండోమ్‌లు, ఆ ట్యాబెట్లు ఇస్తున్నారట..

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్త చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో బీహార్‌లోని క్వారంటైన్ సెంటర్ల నుంచి ఇళ్లకు వెళ్తున్న వేలాది మంది పురుషులు, మహిళలు మాస్కులు కాకుండా.. కండోమ్‌లు, గర్భస్రావ ట్యాబ్లెట్లు తీసుకెళ్లడం ప్రస్తుతం చర్చకు దారి తీసింది. అంతేగాకుండా కరోనా వైరస్ లాక్‍డౌన్‌ను అడ్డుకునేందుకు స్టేట్ హెల్త్ సొసైటీనే వీరికి కండోమ్‌లు, గర్భస్రావ మాత్రలను పంచిబెడుతుందట. 
 
ఇందుకు కారణం 2016 గణాంకాల ప్రకారం భారత్‌లో ఫెర్టిలిటీ రేట్‌లో బీహార్ అగ్రస్థానంలో వుండటమే. కరోనా కారణంగా ఇంటికే పరిమితమవుతున్నారు ప్రజలు. అలాగే వలస కార్మికులు ఇళ్లకు తిరిగి రావడం, మధ్యలో వివాహాలు జరగడం కారణంగా తొమ్మిది నెలల తర్వాత అత్యధిక సంఖ్యలో ప్రసవాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. గతేడాది కూడా ఇదే పరిస్థితి ఏర్పడటంతో కండోమ్‌లను, ట్యాబెట్లను పంచిపెడుతున్నట్లు తెలిసింది. 
 
మార్చి నెలలో హోలీ, దీపావళి, ఛాట్ పండుగల సందర్భంగా వలస కార్మికులు ఇళ్లకు వచ్చారు. సరిగ్గా తొమ్మిది నెలల తర్వాత నవంబరులో రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో డెలివరీలు నమోదయ్యాయని స్టేట్ హెల్త్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ మనోజ్ కుమార్ తెలిపారు.