శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 3 జూన్ 2020 (11:17 IST)

యువకుడితో ఆంటీ రాసలీలలు.. కన్నకొడుకు కంటపడటంతో ఏమైందంటే?

మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. వివాహేతర సంబంధాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వావి వరుసలు, వయోబేధం లేకుండా అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. ఫలితంగా నేరాలు పెరిగిపోతున్నాయి. తాజాగా 40ఏళ్ల మహిళ తనకంటే చిన్నవాడైన యువకుడుతో వివాహేతర సంబంధం కొనసాగించింది. ఈ విషయం ఆమె కుమారుడికి తెలియడంతో.. ప్రియుడితో కలిసి కన్నకొడుకునే చంపేసింది. ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుతుంది. 
 
వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని గోపాల్ గంజ్ జిల్లా దేవరియాలో నివాసం ఉండే 40 ఏళ్ల మహిళకు ఇద్దరు కుమారులు. భర్త ఉద్యోగ రీత్యా ఢిల్లీలో ఉంటున్నాడు. 12 ఏళ్ల పెద్ద కుమారుడు హాస్టల్‌లో ఉండి చదువుకుంటుంటే, ఐదేళ్ల చిన్న కుమారుడిని పెట్టుకుని సదరు మహిళ ఇంటి దగ్గరే ఉంటోంది. 
 
భర్త దూరంగా ఉండటం చిన్న కొడుకుతో ఇంట్లోనే ఉండటంతో స్థానికంగా ఉన్న యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగింది. పెళ్లై భర్త వేరే ప్రాంతంలో ఉద్యోగం చేసుకుంటుంటే... లైంగిక సుఖాల కోసం ఆ మహిళ బరితెగించింది. యువకుడితో పలుమార్లు శారీరకంగా కలిసింది. లాక్ డౌన్ కలిసిరావడంతో ఆ యువకుడు ఆమె వద్దే ఎక్కువసేపు గడిపేవాడు. 
 
అయితే లాక్ డౌన్ పొడిగింపు కార్యక్రమంలో భాగంగా ఇటీవల ఆ మహిళ పెద్ద కుమారుడు ఇంటికి వచ్చాడు. దీంతో తన తల్లి రాసలీలలకు చిన్న బ్రేక్ పడింది. అయినప్పటికీ కొడుకు కంటపడకుండా వారిద్దరూ కలుసుకోటానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. 
 
ఇన్నాళ్లు స్వేఛ్చా జీవుల్లా ఆనందించిన వారికి కొడుకు రావటం కాస్త ఇబ్బందిగా మారింది. అయినా అతడి కన్నుగప్పి శృంగారంలో పాల్గొనాలని యత్నించగా అది కాస్తా కుమారుడు కళ్లారా చూశాడు. తల్లి మరోక యువకుడితో అసభ్యకరమైన పరిస్ధితిలో ఉండటం చూశాడు. కొడుక్కి తన అక్రమ సంబంధం గురించి తెలిసిపోయిందని గ్రహించిన తల్లి కాస్త భయపడింది. ప్రియుడితో కలిసి ఆలోచించింది.
 
కొడుకును చంపేయాలని నిర్ణయించుకుంది. ప్రియుడు మోజులో సుఖానికి అలవాటు పడ్డ మహిళకు పేగుబంధం గుర్తుకు రాలేదు. ప్రియుడు, అతని స్నేహితుడు సహాయంతో కొడుకును కిరాతకంగా చంపింది. 
 
అయితే ఈ ఘటనపై పోలీసులు రంగంలోకి దిగి తమదైన శైలిలో విచారణ జరిపారు. దీనితో కన్నతల్లే కుమారుడి హత్యకు కారణమని కనుగొన్నారు. ఆమె వద్ద జరిపిన విచారణలో రాసలీలల వ్యవహారం బట్టబయలైంది. ఇక పోలీసులు మహిళతో పాటు ఆమెకు సహకరించిన ప్రియుడు, అతని మిత్రుడ్ని అరెస్టు చేశారు.