శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 జనవరి 2020 (13:19 IST)

#KGFChapter2 నుంచి యష్ సెకండ్ లుక్.. ట్రైలర్ వస్తుందనుకుంటే?

కన్నడ రాక్ స్టార్ హీరో యష్ పుట్టినరోజు సందర్భంగా కేజీఎఫ్2 సినిమా సెకండ్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇన్‌టెన్స్ లుక్స్‌తో ఉన్న యష్ లుక్‌ ద్వారా ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ మూవీ విడుదల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
 
ప్రస్తుతం సినిమా శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది. పాన్ ఇండియా చిత్రంగా విడుదలైన `కె.జి.యఫ్ చాప్టర్ 1` అద్భుతమైన విజయాన్ని సాధించింది. దీంతో చాప్టర్ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2020 ద్వితీయార్థంలో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్.
 
జనవరి 8వ తేదీ, బుధవారం యష్ పుట్టినరోజు పురస్కరించుకుని 'కేజీఎఫ్‌2' న్యూలుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. అయితే ఈరోజు టీజర్‌ను విడుదల చేయాలని భావించినప్పటికీ కొన్ని కారణాల వల్ల విడుదల చేయలేకపోతోన్నట్లు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ తెలియజేశారు. తాజాగా విడుదలైన పోస్టర్లో యష్ పెద్ద సుత్తి పట్టుకొని సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నారు. బా
 
లీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ ప్రతినాయక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి రవి బాసుర్‌ సంగీతం అందిస్తున్నారు. శ్రీనిధి శెట్టి, శరణ్‌ శక్తి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 2020 సమ్మర్‌లో మూవీ విడుదల కానుంది.