తెరపై వర్మ జీవితం.. మూడు భాగాలుగా రానున్న మూవీ.. ఫస్ట్ లుక్ ఎప్పుడంటే?

Ramu
శ్రీ| Last Updated: బుధవారం, 26 ఆగస్టు 2020 (11:34 IST)
Ramu
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిజజీవితాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు భాగాల్లో తెరకెక్కించేందుకు బొమ్మాకు క్రియేషన్స్ సిద్ధం అయింది. పూర్తి స్థాయిలో తెరకెక్కించేందుకు మూడు భాగాలుగా తెరకెక్కించనున్నారు. అయితే పార్ట్ 1 సినిమా కి సంబంధించిన ఫస్ట్ లుక్ ఆగస్ట్ 26న సాయంత్రం 5 గంటలకు విడుదల చేసింది చిత్ర యూనిట్.

మూడు భాగాల్లో ఒక్కొక్క చిత్రం యొక్క నిడివి 2 గంటలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. బొమ్మాకు మురళి నిర్మాణంలో ఆర్జీవీ ఆధ్వర్యంలో దొరసాయి తేజ దర్శకత్వంలో సెప్టెంబర్‌లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది.

అయితే మొదటి భాగంలో 20 ఏళ్ల ఆర్జీవీ పాత్రలో ఒక యువ నటుడు నటించబోతున్నాడు, రాము టైటిల్‌తో రామ్ గోపాల్ వర్మ ఆరంభం అంటూ ఉండనుంది.

ఈ భాగంలో విజయవాడలో కాలేజ్ రోజులు, ఆయన ప్రేమలు, ఆర్జీవీ పాల్గొన్న గ్యాంగ్ ఫైట్స్, శివ సినిమా కోసం ఏం చేశాడు, రిలేషన్ షిప్స్‌ను ఎలా వాడుకున్నాడు అనే అంశాలు చూపించనున్నారు. రెండవ పార్ట్‌లో వేరే నటుడు నటించనున్నారు, రామ్ గోపాల్ వర్మ అండర్ వరల్డ్‌తో ప్రేమాయణం, ముంబై జీవితంలో అమ్మాయిలు, గ్యాంగ్ స్టర్స్, అమితాబ్‌తో ఉన్న అనుబంధాలను తెరకెక్కించనున్నారు.

అయితే పార్ట్-3 లో ఆర్జీవీనే స్వయంగా నటించబోతున్నారు. ఆర్జీవీ ది ఇంటెలిజెంట్ ఇడియట్‌తో మూడో పార్ట్ రానుంది. ఆర్జీవీ ఫెయిల్యూర్స్, వివాదాలు, దేవుళ్ళపై, సెక్స్‌పై, సమాజంపై ఉన్న అభిప్రాయాలతో పాటుగా, చాలామందిపై ఉన్న ఆర్జీవీ ప్రభావం గురించి చూపించనున్నారు. ఈ మూడు భాగాల్లో వివిధ వయసులో జరిగిన వేర్వేరు అంశాలపై ఈ ఆర్జీవీ ఉండనుంది.దీనిపై మరింత చదవండి :