1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Dulquer Salmaan launched the energetic track composed sung by S. Thaman

దుల్కర్ సల్మాన్ చేతుల మీదుగా ఫస్ట్ సింగిల్ సిగ్మా స్టయిల్ లాంఛ్

Dulquer Salmaan
Dulquer Salmaan
సందీప్ కిషన్ హీరోగా లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం సిగ్మా. జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం ప్రకటించిన నాటి నుంచే సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది. టీజర్‌కు అద్భుతమైన స్పందన రావడంతో మరింత హైప్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమా కోసం మ్యూజిక్ సెన్సేషన్ ఎస్. తమన్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ కంపోజ్ చేశారు.  
 
తాజాగా హీరో దుల్కర్ సల్మాన్ ‘సిగ్మా’ ఫస్ట్ సింగిల్ ‘సిగ్మా స్టైల్’ ను లాంచ్ చేశారు. తమన్ స్వయంగా కంపోజ్ చేసి ఆలపించిన ఈ ఎనర్జిటిక్ ట్రాక్ మాస్ బీట్‌లతో అదిరిపోయింది. థమన్ సిగ్నేచర్ స్టైల్ మ్యూజిక్, హై-వోల్టేజ్ రిథమ్స్ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
 
 సందీప్ కిషన్ తన స్టైలిష్ డ్యాన్స్ మూమెంట్స్, ఎనర్జిటిక్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకోగా, ఫారియా అబ్దుల్లా కూడా టు అదిరిపోయే డ్యాన్స్ స్టెప్స్‌తో పాటకు మరింత కలర్ తీసుకొచ్చింది.  
 
జేసన్ సంజయ్ రాసిన క్యాచీ లిరిక్స్, థమన్ మాస్ ట్యూన్, సందీప్-ఫారియా డైనమిక్ పెర్ఫార్మెన్స్ కలిసి ‘సిగ్మా స్టైల్’ను ఇన్‌స్టంట్ చార్ట్‌బస్టర్‌గా నిలబెట్టాయి. ఈ సాంగ్‌తో సినిమాపై క్యూరియాసిటీ, ఎక్స్‌పెక్టేషన్స్ మరింతగా పెరిగాయి.
 
ఈ చిత్రంలో రాజు సుందరం, సంపత్ రాజ్, శివ్ పండిట్, అంబు దాసన్, యోగ్ జాపీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
 
ఈ చిత్రానికి కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్  నిర్వహిస్తున్నారు. హరిహరసుతన్ వీఎఫ్‌ఎక్స్ సూపర్‌వైజర్‌గా వ్యవహరిస్తున్నారు. చిత్ర ఆడియో హక్కులను సరేగమా సొంతం చేసుకోగా, డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. సిగ్మా ప్రపంచ వ్యాప్తంగా జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.
About Writer
దేవీ
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
సోల్ ఆఫ్ లెనిన్‌కి థియేటర్లలో అద్భుతమైన స్పందన- జూన్ 26న మనోడు వస్తున్నాడు