1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Chiru 158 Update: Is Nivetha Pethuraj teaching lessons to the Master?

Chiru 158 Update: నివేథా పేతురాజ్ మాస్టర్ కు పాఠాలు చెబుతుందా?

Nivetha Pethu raj and chiranjeevi
Nivetha Pethu raj and chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌ లో రూపొందుతోన్న చిత్రం ఇటీవలే అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. నిన్నటినుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలయింది. తొలి షెడ్యూల్‌లో చిరంజీవి, అనస్వర రాజన్‌లపై కీలక టాకీ పార్ట్‌ను చిత్రీకరిస్తున్నారు. కథలో ఈ సన్నివేశాలుచాలా కీలకంగా ఉండబోతున్నాయి.
 
 
 
ఇందులో ఓ కీలక పాత్ర నివేథా పేతురాజ్ పోషిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ లోకి కోఠిలోని ఉమెన్స్ కాలేజీలో షూటింగ్ మొదలయింది. ఇలా ఐదురోజులపాటు అక్కడే జరుగుతుందని తెలుస్తోంది. ఇందులో స్టూడెంట్స్ గా కాలేజీలో చదివే సీనియర్లు కూడా నటిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
 
ఇక, నివేథా పేతురాజ్ ఆ కాలేజీలో లెక్చరర్ గా నటిస్తుందట. ఓ సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి రావడం అక్కడ కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇది చూసేవారికి మాస్టర్ తరహాని పోలివున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా దర్శకుడు బాబీ చిరంజీవిని 35 ఏళ్ళ వయస్సున్నవాడిగా మార్చినప్పుడే ఏదో యూత్ కు కనెక్ట్ అయ్యే పాత్రను చేపిస్తున్నట్లు అభిమానులు గ్రహించారు.
 
ఇక ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్నారు. పలు భాషల్లో భారీ విజయాలు అందుకున్న కేవీఎన్ ప్రొడక్షన్స్‌కు ఇది తొలి తెలుగు చిత్రం కావడం విశేషం.
 
ఈ సందర్భంగా చిత్రబృందం బీటీఎస్ వీడియోను విడుదల చేసింది. ఇందులో సినిమా ప్రధాన సాంకేతిక బృందాన్ని పరిచయం చేశారు. వీడియోలో ఉత్సాహంగా కనిపించిన చిరంజీవి, “లెట్స్ సెట్ ది బ్లడీ బెంచ్‌మార్క్” అంటూ సందడి చేశారు. అనంతరం దర్శకుడు బాబీని సినిమా టైటిల్ గురించి అడగగా, ఆయన దాటవేయడానికి ప్రయత్నించారు. దానికి చిరంజీవి సరదాగా స్పందిస్తూ, “సరైన సమయంలో నేనే టైటిల్ లీక్ చేస్తానేమో” అంటూ చమత్కరించారు. వీరిద్దరి మధ్య జరిగిన ఈ ఫన్నీ సంభాషణ వీడియోకు ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో పాటు సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.
About Writer
దేవీ
తర్వాతి కథనం
Lenin Teaser: అఖిల్, భాగ్యశ్రీల మధ్య కెమిస్ట్రీ చాలా ఫ్రెష్‌గా లెనిన్ టీజర్ వచ్చేసింది