1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. First Look Poster : BhavadeeyuduBhagatSingh

PSPK28 టైటిల్ ఇదే: భవదీయుడు భగత్ సింగ్

First Look Poster
Pawan kalyan
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్సుకు పండగ చేసుకునే వార్త వచ్చేసింది. భీమ్లా నాయక్, హరిహర వీరమల్లు సినిమాల తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ మరో సినిమాను సెట్స్ మీదకు తీసుకు రానున్నారు. గతంలో గబ్బర్ సింగ్ సినిమాతో భారీ హిట్ సాధించిన ఈ కాంబో మరో భారీ మూవీ చేసేందుకు రెడీ అయ్యారు. అయితే సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా… మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో తెరకెక్కనుంది. 
 
ఈ సినిమా దేశభక్తి కథాంశంగా తెరకెక్కనున్నట్లు టాక్ వినిపిస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నేపథ్యంలో ఈ సినిమా నుంచి ప్రీ లుక్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే… తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్‌ వచ్చింది. 
 
"భవదీయుడు..భగత్‌ సింగ్" పేరుతో టైటిల్‌ ను అనౌన్స్‌ చేస్తూ… చిత్ర బృందం ఓ పోస్టర్‌ విడుదల చేసింది. ఇక ఈ పోస్టర్‌ లో సినిమా టైటిల్‌‌తో పాటు…  పవన్‌ ఫస్ట్‌ లుక్‌‌ను కూడా విడుదల చేసింది చిత్ర బృందం. టీ తాగుతూ…  బైక్‌ పైన కూర్చున్న పవన్‌ పోస్టర్‌‌ను విడుదల చేశారు. 
తర్వాతి కథనం
బిగ్‌బాస్-5: 8th సెప్టెంబర్ హైలైట్స్: ఆలూ కూర కోసం కొట్లాట... యానీ మాస్టర్, జెస్సీల వార్..