గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 8 సెప్టెంబరు 2021 (21:08 IST)

మ‌హేష్‌బాబుతో షూటింగ్ స్పాట్ లో స‌ర‌దాగా గ‌డిపిన ఎం.పి. శశిథరూర్

Shashitharur with Mahesh
మ‌హేష్‌బాబు `స‌ర్కారువారి పాట` షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతుంది. ఇప్ప‌టికే కొంత పేచ్‌వ‌ర్క్‌ను పూర్తిచేసే ప‌నిలో వున్నారు. బుధ‌వారంనాడు పార్ల‌మెంట్ స‌భ్యుడు శశిథరూర్ షూటింగ్‌కు స్పాట్‌కు వెళ్ళారు. వెంట గ‌ళ్ళా జ‌య‌దేవ్ వున్నారు. షూటింగ్‌లోని విష‌యాల‌ను అడిగి తెలుసుకుంటున్న‌ట్లు, మ‌హేస్ అందుకు స‌మాధానం చెబుతున్న వీడియోను బ‌య‌ట‌కు విడుద‌ల చేశారు.
 
Shashitharur with Mahesh
శశిథరూర్ కు ఫీచ‌ర్ ఫిలిం అనుభ‌వం వుంది. అందుకే షూటింగ్‌లో అన్నీ తెలుసుకుని చాలా స‌ర‌దాగా శశిథరూర్ షూటింగ్ స్పాట్‌లో క‌నిపించారు. మ‌హేస్‌బాబు అందుకు త‌గిన‌విధంగా న‌వ్వుతూ స‌మాధానాలు చెబుతున్నాడు. స‌ర్కారువారి పాట బేంక్‌లో జ‌రిగే అవినీతి, కుంభ‌కోణంపై అన్న సంగ‌తి తెలిసిందే. విదేశాల్లో డ‌బ్బు దాచుకునే పాయింట్ ఇందులో వుంది. అయితే ఇది రాజ‌కీయ నాయ‌కుల కోణం కూడా వుంటుంద‌ని తెలుస్తోంది. 
 
అస‌లు ఈపాటికే షూటింగ్ పూర్తి కావాల్సివుంది. కానీ ఆ స్పీడ్‌కు కరోనా బ్రేక్‌లు వేసింది. ప్రస్తుతం షూటింగ్‌లకు ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. దర్శకుడు పరుశురామ్‌ వర్కింగ్‌ స్టైల్‌ కూడా అదే కావడంతో సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.