ఆదివారం, 9 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజయవాడ , శనివారం, 14 ఆగస్టు 2021 (18:34 IST)

అమరరాజా కంపెనీ చెన్నైకి త‌ర‌ల‌దు: గ‌ల్లా జ‌య‌దేవ్

అమరావతి రాజ‌కీయాలు ఇపుడు అమ‌ర రాజా బ్యాట‌రీల కంపెనీ చుట్టు తిరుగుతున్నాయి. ఆ కంపెనీ జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఒత్తిడుల‌ను త‌ట్టుకోలేక చెన్న‌య్ త‌ర‌లిపోతోంద‌ని తెలుగుదేశం నాయ‌కులు ప్ర‌చారం చేశారు.

అయితే ఇపుడు దానికి ఆ కంపెనీ అధినేత బ్రేక్ వేశారు. తెలుగు దేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్‌కు చెందిన అమరరాజా కంపెనీ తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైకి తరలిపోతున్నట్లు గత కొంత కాలంగా తీవ్ర చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో అమరరాజా తరలింపుపై ఆ కంపెనీ కో ఫౌండర్, ఎంపీ గల్లా జయదేవ్ కీలక ప్రకటన చేశారు. చెన్నైకి అమరరాజా తరలింపు పూర్తిగా వదంతులు మాత్రమేనని, కంపెనీ ఇక్కడే ఉంటుందని తేల్చి చెప్పారు. ఇలాంటి వదంతులకు తాము స్పందించబోమని ఎంపీ గల్లా జయదేవ్‌ వ్యాఖ్యానించారు. వివాదాస్పద ప్రశ్నలకు దూరంగా ఉంటామని చెప్పారు.