శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 12 ఆగస్టు 2021 (13:25 IST)

తుదిద‌శ చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోన్న అడివి శేష్‌- మేజర్‌

Major
అడివి శేష్‌ హీరోగా నటిస్తున్నమేజ‌ర్ సినిమా చివ‌రి షెడ్యూల్‌ షూటింగ్ గురువారం  (ఆగ‌స్ట్‌12) ప్రారంభ‌మైంది. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసింది చిత్ర యూనిట్‌.
 
ఇటీవల విడుదలైన టీజర్‌కు దేశవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించ‌డంతో పాటు టీజర్‌ చూసిన ప్రతి ఒక్కరు యూనిట్‌ను ప్రశంసించారు. భారీ అంఛ‌నాల‌తో రూపొందుతున్న మేజ‌ర్ ఫైన‌ల్ షెడ్యూల్ షూటింగ్ లో హీరో అడివిశేష్‌, సాయి ముంజ్రేక‌ర్ పాల్గొంటారు. ఆగ‌స్ట్ చివ‌రిక‌ల్లా ఈ మూవీ షూటింగ్ పూర్త‌వ‌నుంది. ఈ సంద‌ర్భంగా మేక‌ర్స్‌ విడుద‌ల‌చేసిన అడివిశేష్ స్టిల్ ఆక‌ట్టుకుంటుంది.
 
అడివిశేష్ మాట్లాడుతూ, మేజ‌ర్ సినిమా నా ప్యాష‌న్ ప్రాజెక్ట్‌. కొన్నాళ్ల క్రితం వార్తల్లో ఆ విషాద సంఘటనను చూసిన‌ప్ప‌టి నుండి  ఈ చిత్రంతో నా ప్రయాణం మొదలైంది.ఇప్పుడు చిత్రీక‌ర‌ణ చివ‌రిద‌శ‌కు చేరుకుంది. ప్ర‌స్తుతం నేను మిశ్రమ భావోద్వేగాలతో మునిగిపోయాను. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ వంటి ధైర్య‌వంతుడి పాత్ర‌ను నాకిచ్చినందుకు వారి త‌ల్లితండ్రుల‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆ అమరవీరుడి స్ఫూర్తిదాయకమైన జీవితానికి నివాళి అర్పించడంలో విజయం సాధించాలని ఆశిస్తున్నాను` అన్నారు.  
 
నవంబరు 26, 2008న ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడుల్లో వీరోచితంగా పోరాడి ప్రజల ప్రాణాలను రక్షించిన అమరవీరుడు సందీప్‌ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి ‘గూఢచారి’ ఫేమ్‌ శశికిరణ్‌ తిక్క ద‌ర్శ‌కుడు.
అడివి శేష్, సయీ మంజ్రేకర్, శోభితా ధూలిపాళ్ళ, ప్రకాష్‌రాజ్, రేవతి మురళి శర్మ ప్రధాన తారాగణం
మ‌హేష్‌బాబు జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ఫ్లస్‌ ఎస్‌ మూవీస్‌ సంస్థల అసోసియేషన్‌తో సోనీ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోన్న మేజ‌ర్ చిత్రం హిందీ, తెలుగు, మ‌ల‌యాళం భాష‌ల్లో ఈ ఏడాదిలోనే విడుద‌ల‌కానుంది.