మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 21 జులై 2021 (12:17 IST)

రన్నింగ్‌లో ఊడిపోయిన ఆర్టీసీ బస్సు వెనుక చక్రాలు... ఎక్కడ?

ప్రభుత్వ రవాణా సంస్థలకు చెందిన ఆర్టీసీ బస్సుల నిర్వహణకు ఈ సంఘటన అద్దంపడుతోంది. వేగంగా వెళుతున్న ఆర్టీసీ బస్సు వెనుక చక్రాలు ఊడిపోయాయి. దీంతో 40 మంది ప్రయాణికులు అదృష్టవశాత్తు ప్రాణగండం నుంచి బయటపడ్డారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లి వద్ద మోత్కూరు ప్రధాన రహదారిపై ఓ ఆర్టీసీ బస్సు హైదరాబాద్‌ నుంచి తొర్రూరుకు బయలుదేరింది. 
 
40 మందికి పైగా ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సు వెనుక చక్రాలు ఆకస్మాత్తుగా ఊడిపోయాయి. డ్రైవర్‌ అప్రమత్తంగా వ్యవహరించి బస్సు వేగాన్ని నియంత్రించడంతో ఘోర ప్రమాదం తప్పింది. 
 
ప్రాణనష్టం తప్పడంతో ప్రయాణికులు, ఆర్టీసీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించడంతోనే ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు.