ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 5 జులై 2021 (17:55 IST)

శ్రీకాకుళంలో పెన్షన్ డబ్బులతో గ్రామ వలంటీర్ పరార్...?

ఏపీలోని శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, లావేరు మండలం, గుర్రాల పాలెం గ్రామంలో వాలంటీర్ చేతివాటం ప్రదర్శించాడు. గ్రామంలో నివాసం లేకుండా అడ్డదారిలో వాలంటీర్ జాబ్ సంపాదించాడు. తన బాబాయి అధికారాన్ని అడ్డం పెట్టుకొని గ్రామంలో తన 50 ఇల్లు పరిధిలో అభాగ్యులకు ఐదు నెలలుగా వృద్ధాప్య పెన్షన్ ఇవ్వకుండా అలాగే ఇంటి పన్నులకి డబ్బులు తీసుకుని రసీదు ఇవ్వకుండా అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. 
 
తన బాబాయ్‌కి సర్పంచ్ అధికారం ఉండటంతో ఆయన కనుసన్నల్లో ఈ వ్యవహారం జరుగుతూ వచ్చింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని అనడంతో వారికి సంక్షేమ పథకాలు ఆపివేస్తామని భయభ్రాంతులకు గురిచేయసాగాడు. కావున దీనిపైన ఉన్నతాధికారులు విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేస్తారని గ్రామస్తులు వేడుకుంటున్నారు. తల్లి చేను మేస్తే పిల్ల గట్టు మేస్తుందా అన్న నానుడి గుర్రాల పాలెం గ్రామంలో నిజమైనది.