బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : గురువారం, 1 జులై 2021 (13:46 IST)

ఏపీలో మరో డెల్టా ప్లస్ కేసు: పీహెచ్సీ సిబ్బందికి పాజిటివ్

ఏపీలో డెల్టా ప్లస్ కేసులు బయట పడుతున్నాయి. ఇటీవల తిరుపతిలో ఒక డెల్టా ప్లస్ కేసు కలకలం రేపగా.. తాజాగా ఏపీలో మరో డెల్టా ప్లస్ కేసు నమోదైంది. విశాఖలో తొలి డెల్టా ప్లస్ వెలుగు చూసింది. 
 
జీవీఎంసీ జోన్1 విశాఖపట్నం జిల్లా మధురవాడ వాంబేకాలనీలో డెల్టా ప్లస్ మొదటి కేసు నమోదైంది. మధురవాడ పి.హెచ్.సి. పరిధిలోని డోర్ నెంబర్ 20A/gf-3 నివాసి పాడి. మేరీ (51)కు పీహెచ్‌సీ సిబ్బంది టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది.
 
సిబ్బంది శాంపిల్స్‌ను హైదరాబాద్‌లోని ఒక ల్యాబ్‌కు పంపించారు. ల్యాబ్ సిబ్బంది డెల్టా ప్లస్ కేసుగా నిర్ధారించారు. వైద్య సిబ్బంది వాలంటీర్ల సహాయంతో చుట్టు పక్కల ప్రాంతాలను శానిటైజ్ చేస్తున్నారు. బారికేడ్లతో పరిసర ప్రాంతాలను మూసివేశారు.