శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 25 జూన్ 2021 (19:09 IST)

అక్కా నాకు బావ నచ్చాడు, ఆ ఒక్కదానికి అనుమతివ్వు..?

బావని ఆటపట్టించవచ్చు. అతనితో సరదాగా ఉండొచ్చు. కానీ సొంత అక్క భర్తనే కోరుకుంది ఆ చెల్లెలు. అతనితో పెళ్ళి వద్దని శారీరక బంధం మాత్రమే కావాలంటూ అక్కకే చెప్పేసింది. బావ అందంగా ఉన్నాడు. నాకు బాగా నచ్చాడు. పెళ్ళి అయ్యేంత వరకు అతనితో కలిసి ఉంటాను అని అక్కకు చెప్పింది. దీంతో అక్క ఆశ్చర్యపోయింది.
 
మధ్యప్రదేశ్ లోని థార్ జిల్లాలో నివాసముంది ఒక కుటుంబం. ఇంటి దగ్గరలోని బంధువుల అమ్మాయినే సంవత్సరం క్రితం వివాహం చేసుకున్నాడు థాక్రే. పెళ్ళి సింపుల్ గానే  చేసుకున్నాడు. ఇంటికి సమీపంలోనే భార్య ఫ్యామిలీ కూడా ఉండడంతో ఆమె చెల్లెలు తరచూ ఇంటికి వచ్చి వెళుతుండేది.
 
ఇలా బావకు బాగా దగ్గరైంది. అయితే శారీరకంగా ఎప్పుడూ కలవలేదు. అక్కతో చెప్పి చేద్దామనుకుని సంవత్సరం ఆగింది. వారంరోజుల క్రితమే విషయాన్ని నేరుగా అక్కకే చెప్పేసింది. అక్కా... చాలా అందంగా ఉన్నాడు బావ. అతనితో నేను శారీరకంగా కలుస్తాను. పెళ్ళి చేసుకోను.
 
నాకు బావతో కలిసేందుకు పర్మిషన్ ఇవ్వమని కోరింది. దీంతో అక్కకు చిర్రెత్తుకొచ్చి చితకబాదింది. అంతటితో ఆగకుండా పంచాయతీ పెట్టింది. పెద్దలు ఇది తప్పు అని చెప్పారు. దీంతో ఆ యువతి బావను ఒప్పించి అతడిని తీసుకుని ఇంటి నుంచి పారిపోయింది. రెండురోజులు బాగా ఎంజాయ్ చేసి తిరిగి ఇంటికి తిరిగొచ్చారు. 
 
దీంతో మళ్ళీ పంచాయతీ పెట్టారు పెద్దలు. ఆమెతో గడిపిననందుకు మరదలిని పెళ్ళి చేసుకోవాలని థాక్రేకు చెప్పారు. విషయం పోలీసులకు తెలియడంతో ముగ్గురికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కాస్తా గ్రామంలో హాట్ టాపిక్‌గా మారుతోంది.