శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 23 జూన్ 2021 (19:36 IST)

అక్కాచెల్లెళ్ళతో వడ్డీ వ్యాపారి సరసాలు, చివరికి అలా చిక్కుకున్నాడు

అతనో వడ్డీవ్యాపారి. వడ్డీలు ఇస్తూ బాగా సంపాదించాడు. లక్షలు సంపాదించిన వడ్డీవ్యాపారి తనకు డబ్బులు ఇవ్వని వ్యక్తులకు సంబంధించిన ఇళ్లలో ఉన్న మహిళలపై కన్నేస్తాడు. వారిని తన దగ్గరకు పంపాలని బేరం పెడతాడు. ఒప్పుకున్నారా సరే.. లేకుంటే తన డబ్బులు తనకివ్వాలంటూ కూర్చుంటాడు. ఇలాంటి వడ్డీ వ్యాపారికి ఇద్దరు అక్కాచెల్లెళ్ళు బాగా బుద్ధి చెప్పారు.
 
రాజస్థాన్ రాష్ట్రంలోని బర్మర్ జిల్లా పరిసర ప్రాంతంలో ఉన్న యూసఫ్ ఖాన్ స్థానికంగా వడ్డీ వ్యాపారి. పెళ్ళయి ఒక కొడుకు ఉన్నాడు. ఆర్ధికంగా బాగా నిలదొక్కుకున్న వ్యక్తి యూసఫ్. అయితే యూసఫ్ తాను ఇచ్చిన డబ్బులను ఇవ్వకుంటే అప్పుల వారి ఇళ్ళలోకి వెళ్ళి మహిళలను ఇబ్బంది పెడుతూ ఉండేవాడు.
 
ఇలా చేస్తున్న యూసఫ్‌కు అక్కాచెల్లెలిద్దరు పరిచయమయ్యారు. మొదట అక్కతో పరిచయం ఏర్పడింది. పెళ్ళి కాని అక్క యూసఫ్‌ను లైన్లో పెట్టింది. అతనితో కామకేళితో మునిగితేలుతూ అతని నుంచి డబ్బులు తీసుకుంటూ ఉండేది. అవసరానికి డబ్బులు ఇచ్చేవాడు యూసఫ్.
 
తన అక్క యూసఫ్ నుంచి డబ్బులు తీసుకోవడం చూసిన చెల్లెలు కూడా అదే బాట పట్టింది. యూసఫ్‌కు ఆమె కూడా దగ్గరైంది. ఈమెకు కూడా పెళ్ళి కాలేదు. దీంతో ఈమెకు కూడా యూసఫ్ కనెక్టయ్యాడు. అయితే చెల్లెలికి అత్యాస ఎక్కువ. వారంరోజుల క్రితం తనకు 10 లక్షల రూపాయలు అవసరమని చెప్పింది.
 
అంత డబ్బు తాను ఇచ్చుకోలేనన్నాడు యూసఫ్. డబ్బులు ఇవ్వకుంటే తనను రేప్ చేసినట్లు చెబుతానని బెదిరించింది. దీంతో డబ్బులు తీసుకొచ్చి ఇచ్చాడు. తన భార్యకు లెక్క చెప్పాలని ఒక ప్లాన్ వేశాడు. 10 లక్షల రూపాయలను ఎవరో దొంగిలించారని పోలీసు స్టేషన్‌కు వెళ్ళి ఫిర్యాదు చేస్తే తనకు డబ్బులు పోలీసులు ఎక్కడో ఒక చోట తీసిస్తారని అనుకున్నాడు.
 
అనుకున్నదే తడువుగా పోలీసు స్టేషన్‌కు వెళ్ళాడు. కేసు నమోదు చేసేటపుడు యూసఫ్ పొంతనలేని మాటలు చెబుతుండటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. అతన్ని గట్టిగా విచారిస్తే అసలు విషయం చెప్పాడు. తమ విధులకు ఆటంకం కలిగించే విధంగా ప్రవర్తించిన యూసఫ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.