మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 18 జూన్ 2021 (20:20 IST)

ఇద్దరు మరదళ్లతో యువకుడి పెళ్లి.. ఒకే పందిరిలో డుం డుం డుం!

marriage
ఇద్దరు మరదళ్లను వివాహం చేసుకున్నాడు ఓ గిరిజన యువకుడు. ఒకే పెళ్లి పందిరిలో ఇద్దరు మెడలో తాళి కట్టాడు. వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్ జిల్లా, ఉట్నూరు మండలం, ఘన్‌పూర్‌లో ఈ నెల 14న జరిగిన పెళ్లి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘన్‌పూర్‌కు చెందిన అర్జున్ డీఎడ్ పూర్తి చేసి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. అదే సమయంలో తన ఇద్దరు మేనత్తల కూతుర్లతో అర్జున్ ప్రేమాయణం నడిపించాడు. 
 
మొదట ఉషారాణిని, ఆ తర్వాత సూర్యకళతో ప్రేమలో పడ్డాడు. ఇద్దరితో మూడేళ్లు ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమ వ్యవహారం నడిపించాడు. అయితే ఇద్దరు యువతులు పెళ్లి చేసుకోవాలని పట్టుపట్టడంతో కుటుంబసభ్యులతో సమావేశమై ఇద్దరు మేనత్తల కూతుళ్లను ప్రేమిస్తున్నానని, వారిని పెళ్లి చేసుకుంటానని పెద్దలను ఒప్పించి అర్జున్ రెండిళ్ల పూజారి అయ్యాడు. ఇద్దరు మరదళ్లను పెళ్లి చేసుకుని మురిసిపోయాడు.