చిత్తూరు మాండలికాన్ని నేర్చుకున్న రవితేజ
రవితేజ డైలాగ్ మాడ్యులేషన్‌లో తనదైన శైలిలో చెబుతుంటారు. రవితేజ కొన్ని సినిమాల్లో పాటలు కూడా పాడారు. ఉభయ గోదావరి జిల్లా నేపథ్యంలో కూడిన కథలతో వున్న సినిమాలుకు అనుగుణంగా మాట్లాడేవారు. ఇటీవలే క్రాక్ సినిమాలో కూడా ఆ తరహా శైలిలోనే పలికాడు. విలన్ సముద్రఖని నుద్దేశించి, అబ్బిగా సుబ్బిగా నువ్వు ఎవడైతే నాకేంటి తొప్పిగా..` అంటూ గోదావరి యాసలో మాట్లాడాడు. అంతకుముందు ప్లాప్‌లో వున్న ఆ సినిమా ఆయనకు కరోనా టైంలో సక్సెస్ ఇచ్చింది.
ఇప్పుడదే జోష్‌లో వున్నాడు. తాజాగా తన కొత్త సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. ఇది 1990 బేక్‌డ్రాప్‌లో వుండబోతోంది. చిత్తూరు జిల్లా బేక్‌డ్రాప్లో వుండే కథ కనుక అప్పటి మాండలికంలో ఆయన మాట్లాడాల్సి వుంటుంది. అందుకు ఆయన సరికొత్తగా మాడ్యులేషన్ మార్చుకుంటున్నాడు. ఇందులో మజిలీ ఫేమ్ దివ్యాంశ నాయికగా నటిస్తోంది. శరత్ మండవ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. శ్రీనివాస్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.